Vasant Kumar
-
ఆర్థిక సంక్షోభమా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు ఆర్థికశాఖకు నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోందా? అనే ప్రశ్నకు బదులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నట్లయితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేందుకు భారత రాజ్యాంగం అవకాశం కల్పించిందని వారు పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆర్థికశాఖకు నిధుల కేటాయింపుల అంశంపై 2001లో న్యాయవాది యానై రాజేంద్రన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 2011లో రాష్ట్రంలోని సబ్‌కోర్టుల్లో ఫర్నిచర్ కొనుగోలు ధర 10 శాతం పెరిగినందున, ఈ మొత్తంతో కలిపి రూ.9.41 కోట్లు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాసు హైకోర్టు తానుగా ముందుకు వచ్చి విచారణ చేపట్టింది. న్యాయస్థానాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వసంతకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నీ కలిపి ఒకటిగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్, న్యాయమూర్తులు శివజ్ఞానం, మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి తరఫున బదులు పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్లన పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పాలనలో భాగమైన న్యాయశాఖకు ప్రాథమిక, మౌళిక సదుపాయాలను కల్పించడం కోసం నిధులను కేటాయించక పోవడం తమకు ఎంతో బాధను కలిగిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర న్యాయశాఖ అకాడమీకి నిధులను కేటాయించని కారణంగా న్యాయమూర్తులకు ఇచ్చే రెండు శిక్షణ పథకాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగాక రూ.35 లక్షల అదనపు నిధుల కేటాయింపుకు ప్రభుత్వం పరిశీలించి అంగీకరించినట్లుగా సంబంధిత అధికారుల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తమకు సమాచారం అందినా ఇంత వరకు నిధుల జాడ లేదని వారు ఆక్షేపించారు. రూ.150 కోట్ల విలువైన వంద పథకాలు గురించి వెల్లడిచేసిన అభిప్రాయాలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వారు అన్నారు. 50 పథకాలు తొలిదశగా, మిగిలిన 50 పథకాలు రెండోదశగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపిందని అన్నారు. అయితే ఏ పథకానికి నిధులను కేటాయించారో ఇంతవరకు తమకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా వ్యవహరించని కారణంగా రూ.150 కోట్ల నిధులు మురిగిపోయాయని వారు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి దక్కిందని వారు తెలిపారు. న్యాయస్థానాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వారు గుర్తు చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు కేంద్రం ప్రభుత్వం సహాయాన్ని మాత్రమే చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం థార్థిక సంక్షోభంలో కూరుకుపోయిదా లేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లుగా ప్రకటించే ఆలోచన ఏమైనా ఉందాని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నది నిజమైన పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం 360 సెక్షన్ కల్పించిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిపోయినట్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనే అంశానికి బదులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయమూర్తులు ఆదేశిస్తూ కేసును ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు. -
దుబాయ్‌లో తయారైన మణల్
సాధారణంగా కథ డిమాండ్ మేరకు కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను విదేశాల్లో చిత్రీకరించడం జరుగుతోంది. అలాంటిది మణల్ నగరం అనే చిత్రం పూర్తిగా దుబాయ్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకోవడం విశేషం. బీజేఎం అసోసియేట్స్ పతాకంపై ఎంఐ వసంతకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఒరుతలై రాగం ఫేం శంకర్ దర్శకత్వం వహించడంతోపాటుగా ముఖ్య పాత్రను పోషించారు. నటుడు ప్రాజన్ హీరోగా, తనిష్కా హీరోయిన్గా నటించారు. మరో హీరోయిన్గా దుబాయ్‌కు చెందిన వరుణ్ చెట్టి నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఫిలిఫైన్స్, బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్, ఇండియా తదితర దేశాలకు చెందిన నటీ నటులు నటించడం మరో విశేషం అని నిర్మాత తెలిపారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ దుబాయ్‌లో ఎక్కువగా చిత్రాల షూటింగ్‌ను ఎందుకు నిర్వహించరన్న విషయాన్ని తమకు అనుభవపూర్వకంగా అవగతం అయిందన్నారు. అక్కడ చట్ట నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి లొకేషనకు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని, అక్కడ పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంటుందన్నారు. కష్టమైనప్పటికీ తమ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఇష్టంగా నిర్మించామని తెలిపారు. జీవితంలో సాధించాలనుకునే ఒక యువకుని ఇతి వృత్తంగా మణల్నగరం ఉంటుందన్నారు. ఇది ఒక విభిన్న రొమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెలిపారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు ప్రియన్ శిష్యుడు జే శ్రీధర్ ఛాయా గ్రహణం, రెనిల్ గౌతం సంగీతం ఈ చిత్రానికి పక్కాబలంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. -
‘పసుపు’ స్మగ్లర్లకు పోలీసు కవచం
ఎఫ్ఐఆర్ నమోదై కళ్ల ఎదుటే తిరుగుతున్నా అరెస్టు చేయని వైనం భాకరాపేట పీఎస్ పరిధిలో 13న 19మంది ‘ఎర్ర దొంగల’పై ఎఫ్ఐఆర్ వారిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శితో పాటు పలువురు నేతలు 3 కేసులుంటే పీడీ యాక్టు... 9 కేసులున్న బుల్లెట్ సురేష్‌కు మాత్రం మినహాయింపు! ఒక్క ఎర్రచందనం కేసు కూడా నమోదుకాని వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టారు. సాధారణంగా మూడు కేసులు ఉంటే పీడీ యూక్టు పెట్టాలి. 9 కేసులున్న బుల్లెట్ సురేష్‌పై మాత్రం పీడీ యాక్టు పెట్టరు. ఎందుకంటే ఈయన ‘పచ్చ’ చొక్కా వేసుకున్న నేత కాబట్టి. ఈయనే కాదు ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాలో నమోదైన వారిలో చాలామంది దొంగలు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదు. వీరిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధు ఉన్నా పోలీసులు మాత్రం వారివైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే వీరికి సాక్షాత్తు ‘సర్కారు పెద్దల’ ఆశీస్సులు ఉండడమే. సాక్షి, చిత్తూరు: సరిగ్గా నెలరోజుల కిందట ఎర్రచందనం స్మగ్లర్లపై తాడోపేడో తేల్చుకోవాలని ఇటు ప్రభుత్వం, అటు ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించుకున్నారుు. అనుకున్నదే తడవుగా ఆగమేఘాలపై దొంగల జాబితాను సిద్ధం చేశారు. చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 196 మంది దొంగలు ఉన్నట్లు లెక్క తేల్చారు. మొదట్లో వీరి అరెస్టుపై కూడా దూకుడు ప్రదర్శించారు. వారం రోజుల్లో 8మందిని అరెస్టు చేశారు. దీంతో ‘ఎర్ర’ దొంగల వెన్నులో వణుకు పుట్టింది. పోలీసుల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే నెలరోజుల్లోనే సీన్ మారి పోయింది. దొంగల అరెస్టు ప్రక్రియ మందగించింది. దీనికి కారణమేంటని పోలీసులను ప్రశ్ని స్తే నెల రోజుల కిందటికి, ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన వారిని కూడా అరెస్టు చేయలేదు : పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందనేందుకు మచ్చుకు ఉదాహరణగా భాకరాపేట పోలీసులపై వస్తున్న ఒత్తిళ్లేనని అర్థమవుతోంది. ఈ నెల 13న ఇక్కడ 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీ సులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై 147,148 ,353,341,307,ఆర్/డబ్ల్యూ149ఐపీసీ, 379ఐపీసీతో పాటు ఎర్రచందనం అక్రమ నివారణ చట్టం-1989 ప్రకారం పలు సెక్షన్లు పెట్టారు. వీరిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యద ర్శి వసంత్‌కుమార్‌తో పాటు మధు అనే మరో నేత ఉన్నారు. వీరి కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ సురేష్‌పై 2011లో భాకరాపేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబరు 32-2011పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ 19మంది దొంగల జాబితాలో ఈయన పేరు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. పీడీ యాక్టు అమలులోనూ చేతివాటమే: ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ అనే పేరుతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇప్పటి వరకూ అతనిపై ఒక్క ఎర్రచందనం కేసు కూడా లేదు. అయినప్పటికీ ఆయనపై పీడీయాక్టు నమోదు చేశారు. అయితే చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్‌పై 9 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఇతని వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణం సీఎం చంద్రబాబు, అటవీ మంత్రి బొజ్జల ఆశీస్సులు ఉండటమే! అధికార బలంతో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ‘ఎర్రచందనం’ దొంగలు ఏ స్థాయిలో రెచ్చిపోతారో ఇట్టే తెలుస్తుంది. బుల్లెట్ సురేష్ ‘ఎర్ర’ నేరానికి సాక్ష్యాలు ఇవిగో: బుల్లెట్ సురేష్‌పై జిల్లాలోని పలు స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 9 కేసులు ఉంటే అందులో ఒకటి అక్రమ ఆయుధాల కేసు.