Vasant Kunj Police Station
-
ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం
న్యూఢిల్లీ: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి.. మిత్రులతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ప్రయివేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేసే అమిత్, బాధితురాలు రంగాపురి పహారి మురికివాడలో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి గత ఏడాది ప్రేమగా మారింది. శనివారం వాలెంటైన్స్‌డే కావడంతో తన గదిలో సెలబ్రేట్ చేసుకుందామని యువతిని శుక్రవారం అమిత్ తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లిన తర్వాత ఆమెకు కూల్‌డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దానిని తాగిన తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమెపై స్నేహితులతో కలసి అత్యాచారం చేశాడు. కాగా, అమిత్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. -
కోడలిపై ఏసీపీ అత్యాచారం
న్యూఢిల్లీ: కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే సదరు ఉన్నతాధికారి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా గత ఏడాది మేలో మామ ఏసీపీ బెదిరించి తనపై అత్యాచారం చేశారని... ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదించారని... దాంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైయానని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీపీని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు.