
కోడలిపై ఏసీపీ అత్యాచారం
న్యూఢిల్లీ: కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే సదరు ఉన్నతాధికారి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
కాగా గత ఏడాది మేలో మామ ఏసీపీ బెదిరించి తనపై అత్యాచారం చేశారని... ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదించారని... దాంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైయానని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీపీని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు.