యూపీలో రైలు ప్రమాదం
బండా(యూపీ) : వాస్కోడిగామా పాట్నా ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఉత్తర్ ప్రదేశ్లోని బండా సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పట్టా విరగడంతో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇండియన్ రైల్వేస్ పీఆర్ఓ అనిల్ సక్సేనా తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, గాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియాగా ప్రభుత్వం ప్రకటించింది.