Vascular Surgeon
-
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‌తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్‌లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్‌లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్‌లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్‌ఎల్‌ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
వాస్క్యులర్ వ్యాధులు–శస్త్ర చికిత్సలు..
శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే, మంచి వాస్క్యులర్ (నాడీ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌కు చెందిన వాస్క్యులర్ –ఎండోవాస్క్యులర్ సర్జన్, డా. సి. చంద్ర శేఖర్. ఈ వ్యాధుల వివరాలు అందించే చికిత్సల విషయాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు.. రక్త సరఫరాపై ప్రభావం... రక్తనాళాలు కణజాలాల నుండి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అయితే వాస్క్యులర్ వ్యాధులు సాధారణంగా ఈ రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫలకం (కొవ్వు, కొలెస్ట్రాల్‌తో తయారైనది) సిరలు లేదా ధమనుల లోపల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది . రక్త నాళాలకు ఏదైనా నష్టం జరిగి రక్తం ప్రవహించకుండా నిరోధించడం వలన ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం లేదా స్ట్రోక్ వంటి వివిధ సమస్యలు కలుగుతాయి. శస్త్రచికిత్సలతో... చిన్నపాటి వాస్కులర్ వ్యాధులను జీవనశైలి మార్పుల ద్వారా సరిచేయవచ్చు, అయితే కొంతమందికి మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వాస్కులర్ వ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జరీలు... ► యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనే ప్రక్రియలో కాథెటర్–గైడెడ్ బెలూన్ని ఉపయోగించి ఇరుకైన ధమనిని తెరుస్తారు. ఈ విధానం కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ► అథెరెక్టమీ: ఇది రక్తనాళాల నుండి ఫలకాన్ని కత్తిరించడానికి, తొలగించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన కాథెటర్‌ను నిరోధించబడిన ధమనిలోకి చొప్పించే మరొక అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ, ► ఆర్టెరియోవెనస్ ఫిస్టులా: ముంజేయిలోని సిర నేరుగా ధమనికి అనుసంధానించి, సిరను బలంగా వెడల్పుగా చేస్తుంది ► ఆర్టెరియోవెనస్ గ్రాఫ్ట్: ఈ రకమైన శస్త్రచికిత్సలో సింథటిక్ ట్యూబ్ ద్వారా ధమనిని సిరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ► ఓపెన్ అబ్డామినల్ సర్జరీ: ఈ శస్త్రచికిత్సలో పొత్తికడుపు గుండా వెళ్ళే ప్రదేశంలో చిన్న కోత ఉంటుంది. సమస్య ఉన్న ప్రాంతం చుట్టూ రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి దీన్ని చేస్తారు. ► థ్రోంబెక్టమీ: ఈ ప్రక్రియలో సిర లేదా ధమని నుంచి రక్తం గడ్డకట్టడం తొలగించబడుతుంది. సరైన రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది. దీనికి బదులుగా ఒక్కోసారి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ కూడా చేయవచ్చు. ► వాస్కులర్ బైపాస్ సర్జరీ: బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది దెబ్బతిన్న నాళాన్ని దాటవేసే రక్త ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. వెర్టెబ్రోబాసిలర్ వ్యాధి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మూత్రపిండ వాస్కులర్ వ్యాధి, మెసెంటెరిక్ వాస్కులర్ వ్యాధి ఉన్న రోగులకు దీన్ని చేస్తారు. ఓపెన్ కరోటిడ్ , ఫెమోరల్ ఎండార్టెరెక్టమీ: ఈ ప్రక్రియలో కాళ్లు లేదా మెదడులకు రక్తాన్ని అందించే ధమనుల లోపలి పొరలో ఉన్న ఫలకాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. ► ఈ శస్త్రచికిత్సలు రోగి జీవితాన్ని మెరుగుపరుస్తాయి, రోగుల శారీరక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడానికి 1–2 వారాలు అవసరం కావచ్చు –డా. సి. చంద్ర శేఖర్,వాస్కులర్ – ఎండోవాస్కులర్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి -
ఆ.. సౌకర్యాలుంటే చిట్టి బతికేది!
ఎంజీఎంలో కీలక సమయంలో అందని వైద్యం =వాస్క్యులర్ సర్జన్ లేకపోవడం.. =అక్కరకు రాని అంబులెన్స.. =ఏడు గంటల వృథానే కారణం సాక్షి, హన్మకొండ: వేయి పడకల సామర్థ్యం, ఐదు వందల మందికి పైగా వైద్య సిబ్బంది... నెలకు రూ. 15 కోట్లకు పైగా బడ్జెట్... ఏడేళ్ల క్రితమే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్... అయినప్పటికీ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది వరం గల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్లో కొడుకును కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన బానోతు చిట్టి మరణానికి రైలు ప్రమాదం ఎంత కారణమో.. ఎంజీఎంలో సౌకర్యాలు కొరవడడం కూడా అంతే కారణం. కీలక వైద్య పోస్టులు ఖాళీగా ఉండడం... అత్యాధునిక అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలే చిట్టి మరణానికి కారణమని తెలుస్తోంది. ఏడు గంటలు వృథా వరంగల్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆమెను మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కాళ్ల మీదుగా రైలు వెళ్లడంతో నరాలు పూర్తిగా తెగిపోయి తీవ్ర రక్తస్రావమవుతోంది. ఇలాంటి సందర్భంలో శరీరం నుంచి రక్తం బయటకు పోకుండా గడ్డకట్టేలా చేసి, ఆపై శస్త్ర చికిత్స చేయాలి. ఇందుకు వాస్క్యులర్ సర్జన్ అవసరం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో తప్పకుండా ఈ వైద్యుడిని నియమించాల్సి ఉంది. ఏడేళ్లు గడిచినా నేటికీ ఎంజీఎంలో ఈ పోస్టు భర్తీ చేయలేదు. ఫలితంగా రెండు కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావమవుతున్న బానోతు చిట్టికి ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స తప్ప మెరుగైన వైద్యం అందించలేక పోయారు. ప్రాణాలు దక్కాలంటే వెంటనే హైదరాబాద్ తీసుకుపోవాలని వైద్యులు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆమె బంధువులకు సూచించారు. ఈ పరిస్థితుల్లో వైద్య సహాయాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్‌కి పంపించేందుకు అవసరమైన అంబులెన్స్ సౌకర్యం ఎంజీఎంలో కరువైంది. ఎప్పుడో ఏళ్ల క్రితం నాటివి రెండు డొక్కు అంబులెన్సులే ఉన్నాయి. దీంతో చిట్టి బంధువులు డబ్బులు సర్దుకుని ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడుకుని రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌కి పయనమయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో జనగాం దాటిన తర్వాత చిట్టి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస అందక ఇబ్బంది పడింది. తనను ఎలాగైనా కాపాడాలంటూ అంబులెన్స్‌లో ఉన్న భర్తని, బంధువులని వేడుకుంది. అదే పరిస్థితిలో మరికొంత ముందుకు వెళ్లిన తర్వాత రాత్రి 11 గంటలకు భువనగిరి సమీపంలో ఆమె ప్రాణాలు విడిచింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజీఎంలో చేరితే రాత్రి 10:30 గంటల వరకు ఆమెకు మెరుగైన వైద్యం అందలేదు. వాస్క్యు లర్ సర్జన్ పోస్టును భర్తీ చేసినా... కండీషన్లో ఉండి వెంటిలేటర్‌తో కూడిన అంబులెన్స్ అందుబాటులో ఉన్నా ఆ తల్లి బతికేది. ఇవే ఆమె మరణానికి కారణమై ముగ్గురు పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. నెలకు సగటున 20 మంది... ఒక చిట్టి అనే కాదు... వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆస్పత్రికి నెలకు సగటున 20 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగం మందిని మెరుగైన వైద్యం చేయించుకోవాలంటూ నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు ఇక్కడి వైద్యులు. అలా వెళ్తున్న వారిలో చిట్టిలా మృత్యువాత పడుతున్న వారే ఎక్కువ. ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రే అరుునప్పటికీ... ఇప్పటివరకు ఇక్కడ కార్డియాలజిస్టు, న్యూరోసర్జన్, న్యూరో ఫిజీషియన్, ఎండ్రోకైనాలజీ విభాగాలకు చెందిన రెగ్యులర్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం... ఉత్తర తెలంగాణ తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎంలో వెంటిలేటర్లు మూడు మాత్రమే పనిచేస్తుండడం ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు నెల్లికుదురు మండలం ఆలేరు శివారు ఇస్రా తండాకు చెందిన బానోతు శంకర్, చిట్టి దంపతుకుల ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి అంజలి (6), అరుణ్ (4), రోహిత్ మూడు నెలలు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడు నెలల కొడుకు రోహిత్‌కు జ్వరం రావడంతో వరంగల్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రమాదంలో చిక్కుకుని మరణించడంతో ముగ్గురు పిల్లలకు తల్లి దూరమైంది. నాతో బాగానే మాట్లాడింది రోహిత్‌కి మూడు రోజులసంది జరం, సర్ది చేసిందని వరంగల్‌కు ఆస్పత్రికి తీస్కపోయింది. యాక్సిడెంట్ అయిందని తెల్సి సాయంత్రం ఆరున్నరకు ఎంజీఎంకు పోయినం. మంచిగనే మాట్లాడింది. పిల్లలను చూసుకుంది. అంతనొప్పిల గూడ రోహిత్ ఎట్లున్నడంటూ చూపించేదాక పట్టుబట్టింది. ఆఖరికి అంబులెన్సు ఎక్కేటప్పుడు రోహిత్‌ను చూపించమంది. బిడ్డ తల చుట్టూ ప్రేమగా రెండు చేతులు తిప్పి దిష్టి తీసింది. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండు దాక మంచిగనే మాట్లాడింది. ఇగ బతుకుతదని అనుకున్న... కానీ ఇట్లైతదని అనుకోలే. - శంకర్, చిట్టి భర్త