ఒకపుడు ఉద్యోగం లేదు...మరిపుడు..
చెన్నై
ఒకప్పుడు ఉద్యోగంకోసం వెదుకులాడిన వ్యక్తి దశాబ్దం తరువాత కోట్ల రూపాయల సంస్థకు అధిపతి అయ్యాడు. నమ్మలేక పోతున్నారా.. ఇదినిజం. చెన్నైకి చెందిన మైక్రో ఫినాన్స్ వ్యాపార వేత్త పీఎన్ వాసుదేవన్(53) ఈ ఘనత సాధించారు. అయితే ఆయన విజయ ప్రస్థానం అంత అషామాషీగా సాగలేదు. అనుకోకుండా వ్యాపారంలోకి ప్రవేశించినా.. నిబద్ధతతో, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రస్తుతం ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించిన వాసుదేవన్ అటు ఉద్యోగులకు, ఇటు రుణగ్రహీతలకు అభిమానపాత్రుడిగా నిలిచారు.
చెన్నైకి చెందిన వాసుదేవన్ మామూలు మధ్య తరగతి మనిషిలా చోళమండలం ఫినాన్స్ సంస్థలో ఉద్యోగంలో చేరారు . వ్యాపారం నిమిత్తం ముంబై కి తరచూ ప్రయాణిస్తున్న క్రమంలో ముంబైలోని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ కి షిప్ట్ అయ్యారు. అయితే అక్కడి కాలుష్యం కారణంగా అతని కుమార్తె అనారోగ్యం బారిన పడింది. వైద్యుల హెచ్చరికలతో అతను మళ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైకి మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా... సొంతంగా కంపెనీ పెట్టాలని ప్రతిపాదన వచ్చినా చేతిలో అంత పెట్టుబడి లేకపోవడంతో కొంచెం తటపటాయించాడు. చివరికి చోళమండలం సంస్థ పెద్దలు, ఇంకా కొంతమంది స్నేహితుల సహకారంతో 2007 లో ఈక్విటాస్ హోల్డింగ్స్ అనే కంపెనీ స్థాపించాడు. అంతే ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అలా ఈ ఏప్రిల్ 5న స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయిన ఈక్విటాస్ హోల్డింగ్స్ లిమిటెడ్ దూసుకుపోతోంది. ప్రతి షేర్ ముఖ విలువ రూ.10, బాండు ధర రూ.10- నుంచి రూ.110గా పబ్లిక్ ఇష్యూకు జారీ చేసిన కంపెనీ అధిపతి పి.ఎన్.వాసుదేవన్ భారీ లాభాలను ఆర్జించారు. 120 కోట్లతో లిస్టైన కంపెనీ ఇపుడు రూ 4,600 కోట్ల వ్యాపారాన్ని సాగిస్తోంది.
మరోవైపు బిలియన్ డాలర్ల కంపెనీలన్నీ తమ లాభాల్లో రెండు శాతాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుండగా.. చాలా యేళ్ల ముందునుంచే వాసుదేవన్ 5 శాతం లాభాలను దీని కోసం పక్కన పెడుతున్నారు. ఎందుకంటే తమ ఖాతాదారులకు స్కూల్స్, ఆసుపత్రిలాంటి కనీస సౌకర్యాలు లేవని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు తమ వ్యాపారానికి విరాళాలకు కూడా ఆయన అంగీకరంచరు. మీరు సేవ చేయాలంటే..స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయమని సలహా ఇస్తారు.
తాము అందించిన సేవలకు ప్రతిఫలంగా ప్రజలు తమను ఇష్టపడటం ప్రారంభించారని వాసుదేవన్ చెప్పారు. ఎస్ కెఎస్ మైక్రోఫైనాన్స్ సంస్థ సునామిలో కూడా తమ సంస్థ గట్టిగా నిలబడి పాఠాలు నేర్చుకున్నామన్నారు. రుణగ్రహీతలు నేలపై కూర్చుని ఉన్నప్పుడు తాము కుర్చీలో కూర్చోకుండా.. వారికి స్థాయికి దిగి రుణాలను అందచేయడమే తమ విజయ రహస్యమన్నారు. తన జీతంలో కోత పెట్టాల్సిందిగా బోర్డు మీటింగ్ లో ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ఈ విషయంలో ప్రపంచంలోఎక్కడైనా ఒక కంపెనీ లోని అతి తక్కువ వేతనం కంటే 40 రెట్లకు మించి టాప్ అధికార్ల జీతం ఉండకూడదన్న ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ సూత్రం తనకు ప్రేరణ అని, దాన్ని తాను ఫాలో అయ్యానని పేర్కొన్నారు.
వాసుదేవన్ ఏం చేసినాపారదర్శకంగా చేస్తారని.. అతని మూలాలను మర్చిపోలేదని కంపెనీ స్థాపనలో సహకరించిన స్పార్క్ క్యాపిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె. రామకృష్ణన్ ప్రశంసించారు. కాగా ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు ఆర్ బీ ఐ నుంచి చిన్న ఆర్థిక బ్యాంకు (ఎస్ఎఫ్బీ) లైసెన్స్ లభించిన సంగతి తెలిసిందే.