vedalam remake
-
రీమేక్ సినిమా కోసం మెగాస్టార్‌కు రూ.60 కోట్లు!
టాలీవుడ్లో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పండగ పూట బాస్ సినిమా రిలీజైతే వార్ వన్‌సైడ్ అయిపోతుంది. అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. ఖైదీ నం.150 విడుదలైన రెండేళ్లకు సైరా వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు రూ. 40 కోట్లు అందుకున్నారట. తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారట. ఇందులో కాజల్ హీరోయిన్గా నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: రౌడీ బేబి @ వందకోట్లు) తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ అజిత్ చిత్రం 'వేదాళం' రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా మార్పుచేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్నట్లు వినికిడి. ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రూ.60 కోట్లకు ఫిక్స్ చేశారు. బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న దీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) -
పవన్ కొత్త సినిమా ప్రారంభం
విజయదశమి సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళంలో అజిత్, శ్రుతిహాసన్ జంటగా నటించిన వేదలం సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సినిమా ప్రారంభోత్సవం చాలా సింపుల్‌గా జరిగిందని, కేవలం పవన్ కల్యాణ్, దర్శకుడు నేశన్, నిర్మాత ఏఎం రత్నం మాత్రమే ఇందులో పాల్గొన్నారని సినిమా వర్గాలు తెలిపాయి. గతంలో జిల్లా సినిమా తీసి మంచి విజయం సాధించిన నేశన్.. ఇప్పుడు తెలుగులో పవన్‌తోనే ఆరంగేట్రం చేస్తున్నాడు. కాగా, పవన్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్‌లే. అజిత్ ఇంతకుముందు తీసిన వీరం రీమేక్‌గా కాటమరాయుడు చేస్తున్నాడు. దీనికి గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వేదలం రీమేక్ చేస్తున్నాడు.