పవన్ కొత్త సినిమా ప్రారంభం
విజయదశమి సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళంలో అజిత్, శ్రుతిహాసన్ జంటగా నటించిన వేదలం సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సినిమా ప్రారంభోత్సవం చాలా సింపుల్‌గా జరిగిందని, కేవలం పవన్ కల్యాణ్, దర్శకుడు నేశన్, నిర్మాత ఏఎం రత్నం మాత్రమే ఇందులో పాల్గొన్నారని సినిమా వర్గాలు తెలిపాయి. గతంలో జిల్లా సినిమా తీసి మంచి విజయం సాధించిన నేశన్.. ఇప్పుడు తెలుగులో పవన్‌తోనే ఆరంగేట్రం చేస్తున్నాడు.
కాగా, పవన్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్‌లే. అజిత్ ఇంతకుముందు తీసిన వీరం రీమేక్‌గా కాటమరాయుడు చేస్తున్నాడు. దీనికి గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వేదలం రీమేక్ చేస్తున్నాడు.