vedio conferance
-
‘మన బడి నాడు-నేడు’ పై మంత్రి సమీక్ష
సాక్షి, మార్కాపురం: ‘మనబడి నాడు-నేడు’పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులకు ఇప్పటికే సప్తగిరి ఛానెల్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ద్వారా కూడా ఆడియో తరగతులు నిర్వహించి.. పరీక్షల వరకు విద్యార్థులకు పాఠాలు వినిపించాలని మంత్రి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
స్పందనపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమయింది. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారితో సీఎం జగన్ ప్రమాణం చేయించారు. -
పుష్కర ఏర్పాట్లు వేగవంతం చేయండి
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రోడ్డు రవాణ సంస్థ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు జయరావు సూచించారు. బుధవారం ఆయన విజయవాడ నుంచి స్థానిక అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండడంతో 5వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. భక్తుల కోసం తిప్పే బస్సుల కండిషన్‌ను మెరుగుపరచాలన్నారు. వీటి కోసం అవసరమైన సామాగ్రిని, వస్తువులను కడప జోనల్ కార్యాలయం నుంచి తెప్పించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్ఎం వెంకటేశ్వర రావు, డీసీటీఎంలు శ్రీనివాసులు, మధుసూధన్, డీసీఎంఈ జీవన్, పర్సనల్ ఆఫీసర్ సర్దార్ హుసేన్ పాల్గొన్నారు.