Veerareddy
-
బిజివేముల కోట..రాజన్న బాట
సాక్షి, కడప : కడపకు ఈశాన్య దిశలో 60 కిలోమీటర్ల దూరంలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు ఉంది. సుమతి శతక కారుడు బద్దెన ఈ ప్రాంతాన్ని పాలించారు. దీంతో పూర్వం ఈ ప్రాంతాన్ని బద్దెనవోలుగా పిలిచేవారు. కాలక్రమంలో అది బద్వేలుగా మారిందని చెబుతారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ నియోజకవర్గానికి సరిహద్దులుగా ఉన్నాయి. లంకమల అభయారణ్యం, నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన, గోపవరం, అట్లూరు మండలాలు వస్తాయి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్–జెలు కలిసి ఏడుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, వైఎస్సార్ కాంగ్రెస్, పీఎస్పీ, ఇండిపెండెంట్, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కసారి గెలిచారు. బద్వేలు నుంచి బి.వీరారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2011 గణాంకాల ప్రకారం .... జనాభా : 2,74,179 రూరల్ :74.24 శాతం అర్బన్ : 25.76 శాతం మొత్తం ఓటర్లు : 1,91,237 పోలింగ్ కేంద్రాలు : 272 -
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచిన రైతు
సాక్షి, సిద్ధిపేట : జిల్లాలోని కోహెడ మండలం వరికోలులో సోమవారం విషాదం చోటు చేసుకుంది. వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందిన రైతు వీరారెడ్డి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుకు పూనుకున్నాడు. ఫ్యూజు వేసే పనిలో నిమగ్నమై ఉండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు. లైన్ క్లియరెన్స్ తీసుకున్నాకే తాము మరమ్మత్తు మొదలుపెట్టామని, ఈ లోగానే కరెంట్ సరఫరా అయిందని, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. -
వేధింపులతో దంపతుల ఆత్మహత్య
నా అనుకున్నవారే శత్రువుల్లా మారి వేధించడంతో మనస్థాపంచెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా హుజూర్నగర్ రూరల్ మండలం కందికొండ కాలువ గట్టు వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మేళ్లచెరువు గ్రామానికి చెందిన వి. వీరారెడ్డి(24), భవానీ(22)కు రెండేళ్లక్రితం వివాహమైంది. వీరారెడ్డి వ్యవసాయం చేసి జీవనం సాగించేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే వీరారెడ్డి తమ్ముడు, అతని భార్య, తల్లి కామేశ్వరమ్మ అకారణంగా తమను సూటిపోటిమాటలు అంటూ వేధిస్తుండేవారని వీరారెడ్డి దంపతులు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తాను, తన భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా రోజూ గొడవపడుతూ తమను మానసికంగా వేధించేవారని అందులో రాశారు. కారణంగా తమను పలు విధాలుగా బాధపెడుతుండడంతో తమకు మరణం తప్ప మరో మార్గం లేక పురుగుల మందు తాగి ఇద్దరం మరణిస్తున్నామని, తమ అనంతరం తనకు చెందిన ఆస్తి మొత్తం తన భార్య భవానీ తల్లిదండ్రులకు చెందాలని వీరారెడ్డి లేఖలో పేర్కొన్నాడు. మోటార్‌బైక్‌లో వచ్చిన వీరారెడ్డి, భవానీ దంపతులు హుజూర్నగర్ రూరల్ మండలం వేపలసింగారం వద్ద కందికొండ కాలువ గట్టుపై చెట్టుకింద పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు హుజూర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.