సాక్షి, సిద్ధిపేట : జిల్లాలోని కోహెడ మండలం వరికోలులో సోమవారం విషాదం చోటు చేసుకుంది. వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందిన రైతు వీరారెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తుకు పూనుకున్నాడు. ఫ్యూజు వేసే పనిలో నిమగ్నమై ఉండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు. లైన్ క్లియరెన్స్ తీసుకున్నాకే తాము మరమ్మత్తు మొదలుపెట్టామని, ఈ లోగానే కరెంట్ సరఫరా అయిందని, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment