ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మయ్య
విజయవాడ (మధురానగర్): ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన వీర్ల బ్రహ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన మహాసభ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని, సమన్వయంతో పనిచేయాలని సమావేశం తీర్మానం చేసింది. బ్రహ్మయ్యను ముదిరాజ్ మహాసభ జిల్లా, నగర అధ్యక్షులు సాధనాల ప్రసాదరావు, దాసం రామరాజు, ఎన్జీవో నాయకులు పి.వి.ఎల్.ఎన్.రాజు, కంభం కొండలరావు, బలరామ్ అభినందించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు.