Vegan Restaurant
-
వేగన్.. కేసేఫ్
పదుల సంఖ్యలో వెలుస్తున్న కేఫ్లుగణనీయంగా పెరిగిన వేగనిస్టులునయా ట్రెండ్ ఫాలో అవుతున్న యువతమార్క్సిజం.. లెనినిజం.. జగనిజం.. ఇవన్నీ రెగ్యులర్‌గా వినేవే.. కొత్తగా ఈ వేగనిజం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి...జంతువుల మాంసమే కాకుండా పాలు, గుడ్లు, నెయ్యిలాంటి ఇతర జంతు సంబంధిత పదార్థాలను తినని వారిని, జంతు సంబంధిత పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడని వారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. దీనికున్న మరో పేరే వేగనిజం. నగరంలో గత కొంతకాలంగా వేగనిజం ప్రాచుర్యం పొందుతోంది. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగజీవాల స్వేచ్ఛా వాతావరణానికి హాని తలపెట్టనివారందరూ వేగనిస్టులుగా మారుతున్నారు. వినూత్న రుచులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భాగ్యనగరంలో వేగనిస్టుల కోసం పదుల సంఖ్యలో వేగన్ కేఫ్‌లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వేగనిజంపై మరిన్ని విశేషాలు..సాక్షి, హైదరాబాద్: నవాబుల కాలం నుంచి నేటి వరకూ... బిర్యానీ మొదలు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కలిగిన కాంటినెంటల్ ఫుడ్స్ వరకూ భాగ్యనగరంలో దొరకనిదేదీ లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ తయారయ్యే బిర్యాని విదేశాలకు ఎగుమతవుతుందనే విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు.. అలా అనేక వెరైటీలకు పేరుగాంచిన నగరంలో ప్రస్తుతం కొత్తగా వినిపిస్తున్న మాట వేగన్ ఫుడ్.. ‘వేగనిజం’లో భాగంగా పుటుకొచి్చందే ఈ వేగన్ ఫుడ్. జీవుల భద్రతకు పాటుపడేవారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. గత దశాబ్దకాలంగా జంతు ప్రేమికుల ఆధ్వర్యంలో వేగన్ క్లబ్‌లు, వేగన్ గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా వేగన్ ఫుడ్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా నగరంలో వేగన్ ఫుడ్ ప్రాచుర్యం పొందడమే కాకుండా ఎన్నో వేగన్ ఫుడ్ కోర్ట్‌లను ప్రారంభిస్తున్నారు. ఇలా 2015లో నగరంలోని బంజారాహిల్స్‌లో మొట్టమొదటి వేగన్ కేఫ్ ఏర్పాటు చేయగా ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేగాకుండా 2019లోనే ‘పెటా’ ఆధ్వర్యంలో ‘మోస్ట్ వేగన్ ఫ్రెండ్లీ సిటీ’గా నగరాన్ని ఎంపిక చేయడం విశేషం. వినూత్నంగా వేగన్ క్లబ్‌లు.. వేగనిజం పై అవగాహన పెరుగుతుండటంతో పలువురు జంతు ప్రేమికులు ఒక సమూహంగా వేగన్ క్లబ్‌లను ఏర్పాటు చేసుకొని వేగన్ ఫుడ్ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఎలాంటి జంతు పదార్థాలను తినకూడదు. అందుకోసమే పల్లీలు, బాదం నుంచి తీసిన పాలతో పెరుగు, పన్నీర్లాంటి వినూత్న పదార్థాలను తయారు చేస్తున్నారు. మాంసాన్ని పోలి ఉండే ప్లాంట్ మీట్‌ను తయారు చేస్తున్నారు. భిన్న రుచుల సమ్మేళనం.. వేగన్స్ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైనిక్ పురి తదితర ప్రాంతాల్లో ఫుడ్ రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి. జంతు సంబంధ పదార్థాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు తదితర మొక్కల పదార్థాలతో ఈ ఫుడ్‌ని తయారు చేస్తారు. ఇందులో భాగంగా డిషెస్, సలాడ్స్, డిసర్ట్స్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు.ఆరోగ్య ప్రదాయిని..జంతు హింసపై అవగాహన పెంచడమే కాకుండా వేగన్ల ఆహార సౌలభ్యం కోసం వినూత్నంగా వేగన్ ఫుడ్ స్టోర్–కేఫ్‌ను ఏర్పాటు చేశాం. వేగన్స్ని సంతృప్తి పరచడానికి పిజ్జాలు, డిసర్ట్స్తో పాటు పలు రకాల ఫుడ్ వెరైటీలు తయారు చేస్తున్నాం. జీవన సమతుల్యం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ విశిష్టతను కలిగి ఉంటుంది. – వేద్ మోహన్, ఈ–వేగన్ ఫుడ్ స్టోర్–కేఫ్, సైనిక్‌పురి. -
నయా ట్రెండ్ ‘వేగన్ ఫుడ్’..!
సాక్షి, హైదరాబాద్: నవాబుల కాలం నుంచి పేరుగాంచిన బిర్యానీ మొదలు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కలిగిన కాంటినెంటల్ ఫుడ్ వెరైటీల వరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది మన భాగ్యనగరం. వినూత్న రుచులను ఆహ్వానించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. అయితే సిటీలో ఈ మధ్య విరివిగా వినిపిస్తున్న పదం ‘వేగన్ ఫుడ్’.. ఈ ఫుడ్ కోసమే ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వేగన్ రెస్టారెంట్లు కూడా వెలిశాయి. వేగన్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్.. ‘వేగనిజమ్’లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ వేగన్ ఫుడ్. జంతువుల మాంసమే కాకుండా పాలు, గుడ్లు, నెయ్యిలాంటి ఇతర జంతు సంబంధిత పదార్థాలను తినని వారిని, జంతు సంబంధిత పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడని వారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగజీవాల స్వేచ్ఛా వాతావరణానికి హానితలపెట్టకుండా వాటి జీవన భద్రతకు వేగన్స్ కృషి చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో కూడా వేగనిజంపై ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది. చదవండి: కోన్ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్!! గత దశాబ్దకాలంగా జంతు ప్రేమికుల ఆధ్వర్యంలో వేగన్ క్లబ్‌లు, వేగన్ గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా వేగన్ ఫుడ్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వేగన్ ఫుడ్ ప్రాచుర్యం పొందడమే కాకుండా ఎన్నో వేగన్ ఫుడ్ కోర్ట్‌లను ప్రారంభిస్తున్నారు. 2015లో హైదరాబాద్‌లో మొట్టమొదటి వేగన్ కేఫ్ ఏర్పాటు కాగా, ప్రస్తుతం అలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా 2019లోనే ‘పెటా’ఆధ్వర్యంలో ‘మోస్ట్ వేగన్ ఫ్రెండ్లీ సిటీ’గా నగరాన్ని ఎంపిక చేయడం విశేషం. విభిన్న రుచుల సమ్మేళనం.. వేగన్స్ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో ఫుడ్ రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్ల వంటి ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి. జంతు సంబంధ పదార్థాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు తదితర మొక్కల పదార్థాలతో ఈ ఫుడ్‌ని తయారు చేస్తారు. ఇందులో భాగంగా సాండ్వెజ్లు, సలాడ్స్, డిసెర్ట్స్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు. చదవండి: చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? ఆరోగ్య ప్రధాయిని.. జంతు హింసపైన అవగాహన పెంచడమే కాకుండా వేగన్ల ఆహార సౌలభ్యం కోసం వినూత్నంగా వేగన్ ఫుడ్ కేఫ్‌ను ఏర్పాటు చేశాం. వేగన్స్ని సంతృప్తి పరచడానికి పిజ్జాలు, డిసర్ట్స్తో పాటు పలురకాల ఫుడ్‌ను తయారు చేస్తున్నాం. అంతే కాకుండా వేగన్ ఫుడ్ స్టోర్ ప్రారంభించాం. జీవన సమతుల్యం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ విశిష్టతను కలిగి ఉంటుంది. వేగన్స్ మాత్రమే కాదు నాన్ వేగన్స్ కూడా కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. - వేద్ మోహన్, ఈ–వేగన్ ఫుడ్ స్టోర్, కేఫ్, సైనిక్‌పురి -
శాకాహారం..కల సాకారం!
‘సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి’ అంటూ మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో సందేశం చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే బాటలో నడవాలని అందాల భామ అమలాపాల్ డిసైడ్ అయ్యారట. అందుకే చెన్నైలో ‘వేగన్’ రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వేగన్ అంటే తెలిసే ఉంటుంది. జంతు ఉత్పత్తులేవీ తినరు. చివరికి పాలు కూడా తాగరు. పూర్తిగా శాకాహారమే తీసుకుంటారు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి, ‘వేగన్’ రెస్టారెంట్‌ని ప్రారంభించాలను కుంటున్నారామె. వీలు చూసుకుని తన కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారు. అంతే కాదు... యోగా, మెడిటేషన్ కేంద్రాలను కూడా మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ఉందట. ప్రతి సంవత్సరం ఎన్నో అనుకుంటున్నా వర్క్ అవుట్ కావడం లేదని, ఈసారి ఎలాగైనా చేసి తీరతానని ఆమె గట్టిగా చెబుతున్నారు. జీవితం చాలా అందమైనదని, చూసే కన్నుల్లోనే తేడా ఉంటుందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ సవ్యంగా సాగుతాయని అంటున్నారామె. ఆరోగ్యకరమైన లైఫ్‌ను లీడ్ చేసేందుకు, క్రమశిక్షణగా మెలిగేందుకు ఇష్టపడతానని అమలాపాల్ అన్నారు.