vehicles distribution
-
సర్కారీ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఈఎంఐ వాయిదాల పద్ధతిలో పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే రెండు మూడు నెలల్లో వెయ్యి వాహనాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. హైస్పీడ్, లోస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా కోసం తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ సిస్టం పాలసీ–2020–30’ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆధారిత వాహనాల స్థానంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం ఈ పాలసీ ఉద్దేశం. పాలసీ అమల్లో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్టు టీఎస్ రెడ్కో పేర్కొంది. ఈ వాహనాల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రాయితీలతో పాటు బ్యాటరీల వ్యయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు లభించనున్నాయి. -
కేసీఆర్.. మరో అంబేడ్కర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం ప్రకటించడమే కాకుండా నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళితులకు మరో అంబేడ్కర్ అయ్యారని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం దళితబంధు పథకం నిధులతో నలుగురు లబ్ధిదారుల కుటుంబాలకు మంత్రుల చేతుల మీదుగా వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..అన్నమాట ప్రకారం దళితబంధు నిధులు రూ. 2000 కోట్లు మంజూరు చేసి దళితుల అభ్యున్నతిపై సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. అణగారినవర్గాల సంక్షేమం, అభివృద్ధి మాటల్లోనే కాదని, లబ్ధిదారులకు వాహనాలు అందజేసి సీఎం కేసీఆర్ తన చేతల్లోనూ చాటుకున్నారని కొనియాడారు. అనంతరం గంగుల మాటాడుతూ..దళితబంధు ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలేరును.. యజమానినయ్యాను నేను వ్యవసాయ పాలేరుగా ఉండేవాడిని. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక్క కొడుకు. దంపతులిద్దరం పనిచేస్తేనే పూటగడిచేది. దళితబంధులో ఇచ్చిన ఈ ట్రాక్టర్‌తో నా జీవితం బాగు చేసుకుంటా. పాలేరుగా ఉన్న నేను యజమానినైతనని జిందగీల ఎప్పుడు అనుకోలే. – దాసారపు స్వరూప–రాజయ్య, వీణవంక కేసీఆర్ మా దేవుడు.. మా ఆయన ఆటో డ్రైవర్. కేసీఆర్ మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపి మాకు దేవుడు అయిండు. అధికారులిచ్చిన అశోక్ లేలాండ్ ట్రాలీతో మా బతుకులు బాగుపడతయి. – జి.సుగుణ–మొగలి, జమ్మికుంట అంబేడ్కర్ నగర్ సీఎం సర్ సల్లగుండాలె.. మాకు స్వరాజ్ ట్రాక్టర్ ఇచ్చిర్రు. నా కొడుకు రాజశేఖర్ మూడునాలుగేళ్లుగా డ్రైవర్‌గా చేస్తుం డు. గందుకే, మాకు ట్రాక్టర్ గావాలన్నం. ఇంకా ట్రాలర్, గడ్డి చుట్టే బేలర్ కూడా తీసుకుంటం. వ్యవసాయ పనులు, పొలంకోతలు, మట్టితరలింపులతో బిజీగా ఉండాలనుకుంటున్నం. – ఎలుకపెల్లి కొమురమ్మ, చల్లూరు, వీణవంక -
ఆంధ్రా తెలంగాణలకు తలో రెండు బైకులు
సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో ఉన్న వాహనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించడం పూర్తయింది. ఇక్కడ ఉన్న మొత్తం వాహనాలను రెండు రాష్ట్రాలలోని జిల్లాల సంఖ్య ఆధారంగా 13: 10 నిష్పత్తిలో కేటాయించారు. జీఏడీలో మొత్తం 48 కార్లు ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు 27, తెలంగాణకు 21 చొప్పున కేటాయించారు. మొత్తం నాలుగు బైకులు మాత్రమే ఉండటంతో వాటిని రెండు రాష్ట్రాలకు తలో రెండు చొప్పున ఇచ్చేశారు.