‘చమురు’ వదులుతోంది!
అంతర్జాతీయ విఫణిలో చమురు ధరలు అంతకం తకూ పడిపోతుంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ చమురు సంస్థలు మాత్రం అరకొరగా తగ్గిస్తూ, మరికొన్ని రోజులు కాగానే తగ్గించిన దాని కంటే ఎక్కువగా పెంచేయటం ఆనవాయితీగా పెట్టు కున్నాయి. ఈ మధ్యకాలంలో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు రూపాయల వరకూ తగ్గగానే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్నును పెంచేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ 3 రూపాయలు పెరగడంతో పెంచిన పన్నును తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగ్గించటానికి చర్యలు తీసుకోవడమేలేదు.
చమురు ధరలు తగ్గితే దాని ప్రయోజనం తొలుత వినియోగదారునికి చెం దాలి. ప్రభుత్వాలు వార్షిక పన్ను రాబడి తగ్గుతుందనే వంకతో పన్ను పెంచటం, ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు పెంచిన పన్నును తగ్గించి విని యోగదారునికి మేలు చేకూర్చే సంగతి వదలి రెండు తెలుగు ప్రభుత్వాలు పౌరులను కేవలం పన్ను చెల్లిం పుదారులుగా చూడటం శోచనీయం.
కప్పగంతు వెంకట రమణమూర్తి సికింద్రాబాద్