Venkata Subrahmanya Sastry
-
వెలుగులు కురిపించే ఆ వరుసే కీలకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే ‘‘ గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధపెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. – డా. గొర్తి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి -
వాల్మీకి- బెర్నార్డ్ షా మధ్య భేదం
1983లో మరణించిన అంబటిపూడి వెంకటరత్నం రాసిన ‘వ్యాసతరంగాలు’ ఒకచోట కూర్చి వాటిని తాజాగా అందుబాటులోకి తెచ్చారు వారి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇందులో సంస్కృతభాషా సంబంధ వ్యాసాలు, కవిత్వతత్త్వ విచార వ్యాసాలతోపాటు రచయిత ఎరిగిన చెళ్లపిళ్ల, వేలూరి, శ్రీపాద, విశ్వనాథ, గడియారం, మధునాపంతుల వ్యక్తిత్వచిత్రణ వ్యాసాలున్నాయి. డాక్టర్ ఐ.సచ్చిదానందం పరిష్కర్తగా వ్యవహరించిన ఈ పుస్తకంలోని(పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: డాక్టర్ డి.నరేష్బాబు, శ్రీషిర్డి సాయిబాబా ట్రస్టు, జూలేపల్లె, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా-518674; ఫోన్: 9491416696) ఒక వ్యాసంలో వాల్మీకి-బెర్నార్డ్ షా మధ్య భేదాన్ని పట్టుకోవడంలో వెంకటరత్నం అంతరంగం తెలుస్తుంది: ప్రాచ్యము, ఆద్యము ‘వాల్మీకి’ రచనము. పాశ్చాత్యము అధునాతనము ‘షా’ రచనము. ప్రపంచము ఇన్ని శతాబ్దములు నడచి వచ్చినది. జ్ఞానమును వృద్ధిచేసి కొనినది. బహుపథములు పరిశీలించినది. స్త్రీచే మోసపోవుచు అధఃపతితుడైన మహావీరుని జూపించినది పాశ్చాత్య కవిత. ఇక ప్రాచ్య కవిత కథా శిల్పమున అధునాతనము వలెనే తేజరిల్లినది. కాని, విశేషము గాంచుడు. స్త్రీ హృదయము పురుషోన్నతికి తోడుపడినది. పడిపోవువాని పెకైత్తినది. అజ్ఞానిని జ్ఞానిని చేసినది. ఇట్లున్నవి ఇరువురి రచనములు. ‘క్చ ౌజ ఈ్ఛట్టజీడ’ని అనువదించితిని. ‘చూడాల’ అను ఏకాంక రచనము జేసితిని. ఈ రెంటిని ఒక దాని చెంత నొకటి నిల్పిన ప్రాచ్య పాశ్చాత్య చిత్తములు, ప్రాచీనతా నవతలు, భారతీయ భారతీయేతరములు ఒక దాని వెంట నొకటిగా కథాంశము ‘కథా లక్ష్యములు’ కవి హృదయములు పొడకట్టినవి. హృదయము వాల్మీకికి నమస్కరించినది. షాను జూచి నవ్వినది.