జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్
బిట్రగుంట : బోగోలు మండలం జువ్వలదిన్నె సమీపంలో భారీ వ్యయంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అధికారులు మంగళవారం స్థల పరిశీలన జరిపారు. చి ప్పలేరు కాలువ సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద హార్బర్ నిర్మాణానికి స్థలం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. కేంద్ర మత్స్యశాఖ సాంకేతిక సంస్థ డెరైక్టర్ వెంకటేష్ ప్రసాద్, డిప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి, మత్స్యశాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు బలరాం తదితర అధికారులు బకింగ్హోమ్ కెనాల్ మీదు గా జలమార్గంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించారు.
అలిచెర్ల బం గారుపాళెం నుంచి బకింగ్హోమ్ కెనాల్ మీదుగా ఫైబర్ బోట్లలో అధికారులు చిప్పలేరు కాలువ స ముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. సముద్ర ముఖద్వారం, పడవల రాకపోకలకు సంబంధిం చిన మార్గాలు పరిశీలించి జువ్వల దిన్నె వద్ద హార్బర్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించా రు. ఈ సందర్భంగా వెంకటేష్ ప్ర సాద్ మాట్లాడుతూ జువ్వలదిన్నె వద్ద సుమారు 25 ఎకరాల్లో రూ.100 కోట్లకు పైచిలుకు వ్య యంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అనుకూలంగా ఉందన్నారు. ప్ర స్తుతం స్థల పరిశీలన పూర్తయిం దని, వాటర్ రిసోర్స్, ఎకనామికల్, శాండ్, పర్యావరణ తదితర ప రిశీలనలు పూర్తయిన తరువాత పూ ర్తి స్థాయి నివేదిక సిద్ధమవుతుందని వివరించారు.
మినీ ఫిషింగ్ హార్బర్లో పడవల రాకపోకలకు వీలు గా జలమార్గం, స్లోప్ ఆర్డర్, మత్స్య సంపద భద్రపరుచుకునేందుకు కో ల్డ్ స్టోరేజీలు, వలలు బాగు చేసుకు నేందుకు, మోటార్లు భద్ర పరుచుకునేందుకు అవసరమైన నిర్మాణా లు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ జయప్రకాష్, కావలి ఎఫ్డీవో ప్రసాద్, వీఆర్వో పార్థసారథి తదితరులు ఉన్నారు.