విద్యుత్ షాక్‌తో రైతు మృతి
రామడుగు : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మిట్ట అనిల్‌కుమార్(21) అనే యువరైతు శుక్రవారం ఉదయం విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. అనిల్‌కుమార్ వ్యవసాయ బావి వద్ద విద్యుత్తు మోటారును అన్ చేయడానికి వెళ్లి స్టార్టర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.