కల్యాణం.. కమనీయం..
హిందూపురం అర్బన్ : స్థానిక చిన్న మార్కెట్లోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఉదయం ఆలయ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయంగా వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.