20 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి ఈ ఏడాదికి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందని డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు తెలిపారు. ఎంపికైన మొత్తం 1151 విద్యార్థుల్లో 20వ తేదీన 576 మందికి, 21వ తేదీన 575 మందికి కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన వివరించారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కాలేకుంటే ముందుగా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. లేకుండా ఎంపిక రద్దు చేస్తామని తెలిపారు.