సరికొత్త వెర్నా లాంచ్: మరో మైలురాయికి హ్యుందాయ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్ ఇండియా మరో మైలురాయిని అధిగమించింది. మంగళవారం దేశీయ మార్కెట్లో న్యూ జనరేషన్ వెర్నాను లాంచ్ చేసింది. దీంతో ఇప్పటివరకు విడుదల చేసిన హ్యుందాయ్ కార్ల సంఖ్య 50లక్షలకు చేరింది.
ఆధునిక ప్రీమియం బ్రాండ్ దిశగా వినియోగదారుల ఆకాంక్షలకనుగుణంగా ప్రపంచస్థాయి, బెంచ్‌మార్క్ ఉత్పత్తులను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై.కె. కో ప్రకటించారు. కస్టమర్లు, భాగస్వాములు, నిపుణులచే అత్యంత ప్రియమైన, విశ్వసనీయ బ్రాండ్ గా పేరొందిన హ్యుందాయ్ 5 లక్షల మైలు రాయిని తాకడం సంతోషంగా ఉందన్నారు. దేశీయ కార్ సెగ్మంట్లో వేగమైన వృద్ధిని హ్యుందాయ్ నమోదు చేస్తోందని ప్రకటించారు. తమ 50లక్షలవ న్యూ జనరేషన్ వెర్నా లాంచింగ్‌తో మార్కెట్లో కస్టమర్లను ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ దీర్ఘకాలిక నిబద్ధత వెల్లడైందన్నారు.
దేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న హ్యుందాయ్ 1998లోఉత్పత్తిని ప్రారంభించింది. వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన కేవలం ఎనిమిది సంవత్సరాల, ఏడు నెలలకాలంలోనే మొట్టమొదటి మిలియన్ కారు శాంత్రను విడుదల చేసింది. 2013 జూలైలో మూడు మిలియన్ల మార్క్‌ను, నవంబర్ 2015 లో 4 మిలియన్ మార్కును చేరుకుంది.
కాగా హ్యుందాయ్ శాంత్రో, ఇయాన్, వెర్నా, క్రెటా, ఐ 10 గ్రాండ్, ఎలైట్ ఐ 20 , ఐ20 యాక్టివ్, యాక్సెంట్, టక్సన్, ఎలంత్రా లాంటి మోడల్స్‌ను అందుబాటులోకి తెస్తున్న హ్యుందాయ్ గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా , ఆసియా పసిఫిక్ తదితర 87 దేశాలకు తన వాహనాలను రవాణా చేస్తుంది.