రూ.7.88 లక్షలకు కొత్త వెర్నా, కానీ... | New Hyundai Verna Launched For Rs 7.99 Lakh, But Only for First 20,000 Cars | Sakshi
Sakshi News home page

రూ.7.88 లక్షలకు కొత్త వెర్నా, కానీ...

Published Tue, Aug 22 2017 2:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

రూ.7.88 లక్షలకు కొత్త వెర్నా, కానీ...

రూ.7.88 లక్షలకు కొత్త వెర్నా, కానీ...

సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్‌ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌, ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న తన సీ-సెగ్మెంట్‌ సెడాన్‌ కొత్త వెర్నాను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ కారు బేస్‌ వేరియంట్‌ ధర రూ.7.99 లక్షలు. దీని టాప్‌ వేరియంట్‌ ధర రూ.12.1 లక్షల వరకు ఉంది. ఆశ్చర్యకరంగా ఈ ధరల్లో తొలి 20వేల కస్టమర్లకు మాత్రమే కొత్త వెర్నా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత సమీక్షించిన ధరల ప్రకారం, ఈ కొత్త వెర్నా ధర పెరుగనుంది. 1.6 లీటరు పెట్రోల్‌, డీజిల్‌ మోటార్స్‌ను ఈ కొత్త వెర్నా కలిగి ఉంది. పెట్రోల్‌ ఇంజిన్‌ 123 బీహెచ్‌పీ, 151 ఎన్‌ఎం టర్క్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్‌ ఇంజిన్‌ 128బీహెచ్‌పీ, 260ఎన్‌ఎం టర్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది.
 
ఈ రెండు ఇంజిన్‌లు 6 స్పీడు మాన్యువల్‌ ట్రాన్సమిషన్‌ను లేదా 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సమిషన్‌ను కలిగి ఉన్నాయి. తర్వాత 1.4 లీటరు డీజిల్‌ ఇంజిన్‌ను కూడా తన లైనప్‌లో యాడ్‌ చేయనుంది. ఈ 5వ తరం వెర్నాకు ముందు వైపు ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ ఉన్నాయి. వెనుకవైపు ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌తో ఇది రూపొందింది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఆపిల్‌ కారుప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్టులతో పాటు... భద్రతాపరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఈబీడీతో ఏబీసీ, ఈఎస్‌సీలు ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement