vertebra
-
పగోడికీ..ఈ కష్టం వద్దు!
కుటుంబ పోషణ కోసం పొట్ట చేతబట్టుకుని నైజాం వెళ్లింది ఆ కుటుంబం. ఇంటి యజమాని బేల్దారి పని చేసుకుంటూ భార్య, పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. ఇంతలో విధి ఆ కుటుంబంపై పగ బట్టింది. బేల్దారి పని చేసే సమయంలో నాలుగో అంతస్తు నుంచి పరంజా విరిగి కింద పడిపోయాడు. ఫలితంగా వెన్ను, రెండు కాళ్లూ విరిగి ఇప్పుడు మంచానికి పరిమితమయ్యాడు. ఆరేళ్లుగా మంచం పట్టడంతో అండగా ఉండాల్సిన భార్య..భర్తను వదిలి పుట్టింటికి చేరింది. చివరకు ఇద్దరు కుమార్తెలు చదువుకు ఫుల్స్టాప్ పెట్టి తండ్రికి బాసటగా నిలిచారు. పగోడికీ మా కష్టం వద్దని దేవుడిని వేడుకుంటున్నారు. గార్లపేట (మర్రిపూడి): గార్లపేట గ్రామానికి చెందిన బింగినపల్లి లక్ష్మణ్ చిన్ననాటి నుండి బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతడికి దర్శి పట్టణానికి చెందిన కోటమ్మతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. దూదేకుల సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌కు ఎలాంటి భూమి లేదు. చిన్న తనంలోనే తండ్రి పెద సిద్ధయ్యను పోగొట్టుకున్నాడు. తల్లి సుభానమ్మ వద్ద ఉంటూ హైదరాబాద్ వెళ్లి బేల్దారి పని నేర్చుకున్నాడు. వివాహం అనంతరం భార్య, బిడ్డలతో పొట్ట చేతబట్టుకుని బేల్దారి పని కోసం నైజాం వెళ్లాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ బండ మైసమ్మ వద్ద పని కుదుర్చుకున్న లక్ష్మణ్ నాలుగో అంతస్తులో తాపీ పని చేస్తున్నాడు. పని చేస్తుండగా పరంజా విరిగి అమాంతం కింద పడ్డాడు. ఇక్కడి నుంచే కష్టాలు ప్రమాదంలో లక్ష్మణ్ వెన్నుపూస, రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్ష్మణ్‌ను తీసుకెళ్లిన మేస్త్రి మస్తాన్ వైద్యానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. పనిచేయించుకున్న ఇంటి యజమాని మరో రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేదు. లక్ష్మణ్ నడవలేక ఆరేళ్లు మంచంలోనే పడి ఉన్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుటుంబ పోషణ భారం కావడంతో తన ఇద్దరి పిల్లలు, భర్తను వదిలేసి భార్య కోటమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ భారం పెద్ద కుమార్తె మహేశ్వరిపై పడింది. రోజూ కూలికి వెళ్లి తండ్రిని పోషించుకుంటోంది. చిన్న కుమార్తె హైమా తండ్రి వద్దే ఉంటూ అన్నం పెట్టడం, మూత్రం పైపు మార్చడం, శరీరం తుడవడం వంటి సపర్యలు చేస్తోంది. బాల్యంలో చదువుకోవాల్సిన ఆ చిన్నారులపై మోయలేని భారం పడింది. ఆరో తరగతిలో చదువు ఆపేసి తండ్రికి సాయంగా మంచి చెడులు చూసుకుంటోంది. కుటుంబ భారాన్ని మోయాల్సిన తండ్రి లేవలేని స్థితిలో మంచం పట్టడం ఆ చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రిని చూసుకుని కుమార్తెలు మౌనంగా రోదించని రోజు లేదు. ఆపన్న హస్తం కోసం తండ్రి వైద్యానికి ప్రతి నెలా రూ.4 వేలు ఖర్చు కావడంతో కుటుంబ భారాన్ని మేయలేకపోతున్నామని కుమార్తెలు మహేశ్వరి, హైమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కనిగిరి వెళ్లి మల్లికార్జున వైద్యాశాలలో చికిత్స చేయించుకుంటున్నామని చెబుతున్నారు. ఇక ఆర్థిక స్థోమత లేదని, వైద్యం చేయించలేక పోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆసర కల్పించకపోవడంతో దాతల సాయంతో గార్లపేటలో ఓ రేకుల ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ తండ్రి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయదలచిన వారు 96660 15375, 98494 25458 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు -
వయోవృద్ధుల్లో ‘వెన్ను’భారం!
- శాశ్వత పరిష్కారానికి సరికొత్త పరిశోధన - ‘అడల్ట్ డీ జనరేటివ్ స్కొలియోసిస్’పై అధ్యయనం - ఉత్తమ పరిశోధనకు తెలుగు వైద్యుడికి జాతీయ అవార్డు సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 65 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కుల్లో 60 % మంది వెన్నుపూస ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీంతోపాటు వంగిపోయి నడవ డం, దూరం నడవలేకపోవడం, కాళ్లు తిమ్మిరి వంటి సమస్యలతో కూడా సతమమవుతు న్నారు. ప్రముఖ వెన్నుపూస వైద్యులు డా.జె. నరేశ్‌బాబు బృందం ఈ సమస్య పరిష్కారానికి సరికొత్త పరిశోధన చేసింది. ఈ బృందం చేసిన పరిశోధనకు అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అవార్డు ఇచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్ఐ సీసీలో జరిగిన కార్యక్రమంలో ఏఎస్‌ఎస్‌ఐ అధ్యక్షుడు డా.రామ్చద్దా చేతుల మీదుగా మల్లికా స్పైనల్ సెంటర్‌కు చెందిన డా.నరేశ్ బాబు ఈ అవార్డు అందుకున్నారు. బృందం లో డా.రాజు, డా.అరుణ్‌కుమార్ ఉన్నారు. ‘స్కొలియోసిస్’ పరిశోధనకుఅవార్డు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి వెన్నుపూస వైద్యులు ఈ సమావేశంలో తమ పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇందులో తెలుగు వైద్యుడైన డా.నరేశ్ సమర్పించిన ‘అడల్ట్ డీజనరేటివ్ స్కొలియోసిస్’ అనే పరిశోధనకు ఈ అవార్డు ఇచ్చారు. వయోవృద్ధుల్లో వంకర తిరిగిన వెన్నుపూసను సరిచేయడం, వంపు వల్ల నరాల మీద కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు పరిశోధన చేశారు. పలువురు వృద్ధులకు శస్త్ర చికిత్సలు నిర్వహించిన అనంతరం ఈయన పరిశోధనా పత్రాలు సమర్పించారు. అత్యంత చిన్న గాటుతో జరిగే ఈ శస్త్రచికిత్స ద్వారా వెన్ను బాధల నుంచి బయటపడచ్చునని రుజువు చేశారు. -
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే?
హోమియో కౌన్సెలింగ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను. వయసు 28 ఏళ్లు. గత రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేక పోతున్నాను. వెన్నుపూస పట్టేసినట్లుగా ఉంటుంది. హెచ్ఎల్ఏ బి27 పాజిటివ్ వచ్చింది. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? దయచేసి వివరించండి. – అనిల్ కుమార్, హైదరాబాద్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ దీర్ఘకాలం మనిషిని బాధించే సమస్య. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇవి ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా యుక్తవయసు వారిలో (18–30 ఏళ్ల వారిలో) తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి పురుషుల్లో అతి సాధారణంగానూ, ఎక్కువ తీవ్రతతోనూ వస్తుంది. హెచ్ఎల్ఏ బి27 ప్రొటీను జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది వెన్నుపూసల మధ్య వాపును కలుగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి జరుపుతాయి. వెన్నెముకతో పాటు పెల్విస్ కీళ్లను ప్రభావితం చేస్తాయి. తమ సొంత రోగ నిరోధకశక్తి తమ సొంత కీళ్లపైనే దుష్ప్రభావం ఇలాంటి కండిషన్‌ను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. దాంతో మనల్ని రక్షించాల్సిన ఇమ్యూనిటీయే మన సొంత శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది. కారణాలు: ∙వాతావరణ కారణాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఉంది ∙వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా వస్తుంది. లక్షణాలు: ∙విశ్రాంతి సమయంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటం, పని చేస్తున్నప్పుడు తీవ్రత తక్కువగా ఉండటం ∙కంటి సమస్యలు, ఎర్రబారడం ∙కీళ్లు, మెడ బిగుసుకొని ఉండటం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం ∙నడుము నొప్పి ∙శరీరంలో చాలా చోట్ల గట్టిదనం (స్టిఫ్నెస్) కలిగి ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణ: ∙ఎక్స్–రే ∙రక్తపరీక్షలు చికిత్స: హోమియోపతిలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను మందులతో సమూలంగా నయం చేసేలా మంచి చికిత్స లభిస్తుంది. హోమియో మందుల ద్వారా చికిత్స చేసి, లక్షణాలను తగ్గిస్తారుకొన్ని నూతన బయలాజికల్ మందులు వ్యాధి వ్యాప్తిని అదుపు చేస్తాయి. ప్రధానంగా కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు ఈ సమస్యను తగ్గించేందుకు బాగా ఉపకరిస్తాయి. అయితే వాటిని అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
18 ఏళ్లుగా మంచంపైనే..
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు తన కలలను సాకారం చేసుకోకముందే జీవచ్ఛవంలా మారాడు. ఊహించని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని నిత్యం నరకయూతన అనుభవిస్తున్నాడు. అరుుతే చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు మంచానికే పరిమితం కావడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మెరుగైన వైద్యం చేరుుంచేందుకు దాతలు ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్ధన్నపేట టౌన్ : మండల కేంద్రానికి చెందిన పసునూరి నారాయణ, ఉమామహేశ్వరి దంపతులకు నలుగురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. అరుుతే కొడుకు శ్రీధర్‌రాజు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచేవాడు. కాగా, పదో తరగతి పరీక్షలో ఆయన అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. అనంతరం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమాలో చేరాడు. కోర్సును అభ్యసిస్తున్న సమయంలోనే 1997లో హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టం నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యాంపస్ సెలక్షన్లో శ్రీధర్‌రాజు కస్టమర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా, డిప్లొమా పూర్తరుున తర్వాత 1998లో కోల్‌కతా క్యాంపస్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందాడు. పర్వత శ్రేణుల్లో ప్రమాదం.. కోల్‌కతాలో పనిచేస్తున్న సమయంలోనే శ్రీధర్‌రాజు డిప్యూటేషన్‌పై అస్సాం రాష్ట్రంలోని గౌహతికి వెళ్లాడు. అరుుతే విధుల్లో భాగంగా అస్సాంలోని సిల్చర్ ప్రదేశానికి బస్సులో వెళ్తుండగా మార్గమధ్యలో మేఘాలయ రాష్ట్రంలోని లోయలో ప్రమాదవశాత్తు వాహనం పడింది. ఈ సంఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. ఇందులో శ్రీధర్‌రాజు కూడా ఉన్నారు. కాగా, బస్సు రోడ్డుపై నుంచి లోయలో పడడంతో శ్రీధర్‌రాజు వెన్నుపూసకు బలమైన గాయాలై శరీరమంతా చచ్చుబడి పోయింది. విషయం తెలుసుకున్న హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టం అధికారులు ఆయనను చెన్నైలోని రాంచంద్ర ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేరుుంచినా కోలుకోలేదు. దీంతో శ్రీధర్‌రాజు వికలాంగుడిగా మారి మంచానికే పరిమితమయ్యాడు. మూలకణాల మార్పిడితో నయమయ్యే అవకాశం.. ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్‌రాజుకు వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు తమకున్న ఇల్లు, భూమిని మొత్తం అమ్ముకున్నారు. అరుుతే మూలకణాల మార్పిడితో శ్రీధర్‌రాజు 70 నుంచి 90 శాతం వరకు కోలుకునే అవకాశం ఉందని మహారాష్ట్రలోని పూనే స్టెమ్‌సెల్ సెంటర్ వైద్యుడు బగుల్ అనంత్ చైతన్య హామీ ఇచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. కాగా, వైద్యం కోసం సుమారు రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారని, సామాన్య కుటుంబానికి చెందిన తమకు అంత ఖర్చుతో కొడుకుకు వైద్యం చేరుుంచే స్థోమత లేదని వారు బోరున విలపిస్తున్నారు. పర్మనెంట్ కాని ఉద్యోగం.. శ్రీధర్‌రాజు ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇన్ఫోసిస్టం యాజమాన్యం ముం దుకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు అప్పటినుంచి ఇప్పటివరకు జీవచ్ఛవంలా మా రిన కొడుకుకు నిత్యం చికిత్సలు చేరుుస్తున్నారు. కాగా, శ్రీధర్‌రాజుకు ఆయుర్వే దం, ఆక్యు పంక్చర్, హోమియోపతి, తదితర వైద్య చికిత్సలు చేరుుస్తున్నా ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి ఫలితం కనిపించలేదు.