యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే?
హోమియో కౌన్సెలింగ్
నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను. వయసు 28 ఏళ్లు. గత రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేక పోతున్నాను. వెన్నుపూస పట్టేసినట్లుగా ఉంటుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 పాజిటివ్ వచ్చింది. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? దయచేసి వివరించండి. – అనిల్ కుమార్, హైదరాబాద్
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ దీర్ఘకాలం మనిషిని బాధించే సమస్య. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇవి ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా యుక్తవయసు వారిలో (18–30 ఏళ్ల వారిలో) తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి పురుషుల్లో అతి సాధారణంగానూ, ఎక్కువ తీవ్రతతోనూ వస్తుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 ప్రొటీను జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఇది వెన్నుపూసల మధ్య వాపును కలుగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి జరుపుతాయి. వెన్నెముకతో పాటు పెల్విస్ కీళ్లను ప్రభావితం చేస్తాయి. తమ సొంత రోగ నిరోధకశక్తి తమ సొంత కీళ్లపైనే దుష్ప్రభావం ఇలాంటి కండిషన్‌ను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. దాంతో మనల్ని రక్షించాల్సిన ఇమ్యూనిటీయే మన సొంత శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.
కారణాలు: ∙వాతావరణ కారణాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఉంది ∙వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా వస్తుంది.
లక్షణాలు: ∙విశ్రాంతి సమయంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటం, పని చేస్తున్నప్పుడు తీవ్రత తక్కువగా ఉండటం ∙కంటి సమస్యలు, ఎర్రబారడం ∙కీళ్లు, మెడ బిగుసుకొని ఉండటం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం ∙నడుము నొప్పి ∙శరీరంలో చాలా చోట్ల గట్టిదనం (స్టిఫ్‌నెస్) కలిగి ఉండవచ్చు.
వ్యాధి నిర్ధారణ: ∙ఎక్స్–రే ∙రక్తపరీక్షలు
చికిత్స: హోమియోపతిలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను మందులతో సమూలంగా నయం చేసేలా మంచి చికిత్స లభిస్తుంది. హోమియో మందుల ద్వారా చికిత్స చేసి, లక్షణాలను తగ్గిస్తారుకొన్ని నూతన బయలాజికల్ మందులు వ్యాధి వ్యాప్తిని అదుపు చేస్తాయి. ప్రధానంగా కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు ఈ సమస్యను తగ్గించేందుకు బాగా ఉపకరిస్తాయి. అయితే వాటిని అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలోనే వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్