vetagadu
-
సౌందర్య, రంభ ఉన్నారని సంతోషపడ్డా.. హీరోగా నన్ను తీసేశారు : శ్రీకాంత్
విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మారాడు శ్రీకాంత్. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ యాక్టర్‌గానూ రాణించాడు. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్. అయితే తన కెరీర్ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారట శ్రీకాంత్. హీరోగా చాన్స్‌లు రాకపోవడంతో వరుసగా విలన్ పాత్రలు చేసుకుంటూ వెళ్లారట. తమ్మారెడ్డి భరద్వాజ్ తనలో హీరోని చూసి.. వన్‌బై టు చిత్రంలో అవకాశం ఇచ్చారట. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆమె, తాజ్‌మహాల్ చిత్రాలు నా కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యాయి. పెళ్లి సందడి తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. ఒకనొక దశలో ఏడాదిలో 13 సినిమాల్లో నటించాను. పగలు ఒక సినిమా, రాత్రి ఒక సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి’అని శ్రీకాంత్ చెపుకొచ్చారు. అలాగే రాజశేఖర్ హీరోగా నటించిన వేటగాడు సినిమాలో తొలుత తననే హీరోగా తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియడంతో చాలా సంతోషపడ్డానని, కానీ చివరి క్షణంలో తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని చెప్పాడు. అయితే హీరోగా తొలగించినప్పటికీ.. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను చేశానని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. -
వేటగాడు ఎవరు?
‘వేటగాడు’ అనగానే అందరికీ ఎన్టీఆరే గుర్తుకొస్తారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో రాజశేఖర్ ఓ సినిమా చేశారు. ఇప్పుడీ టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. శతాధిక చిత్రాల దర్శకుడు రామనారాయణ ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కృష్ణదేవ్, అంజన ఇందులో హీరో హీరోయిన్లు. తన శిష్యుడు మామణితో కలిసి రామనారాయణ ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా రామనారాయణ మాట్లాడుతూ -‘‘ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. గ్రాఫిక్స్‌కూ ప్రాధాన్యం ఉంటుంది. ఓ కోటీశ్వరుని కుమార్తె కిడ్నాప్‌కి గురైన నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో ‘వేటగాడు’ ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని తెలిపారు. బ్రహ్మానందం, నాగబాబు, రాజీవ్ కనకాల, సత్యకృష్ణన్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: శ్రీరామ్, మాటలు: టి.రాఘవ.