వేటగాడు ఎవరు? | ramanarayana directs 'vetagadu' | Sakshi
Sakshi News home page

వేటగాడు ఎవరు?

Published Fri, Oct 18 2013 12:13 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వేటగాడు ఎవరు? - Sakshi

వేటగాడు ఎవరు?

 ‘వేటగాడు’ అనగానే అందరికీ ఎన్టీఆరే గుర్తుకొస్తారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో రాజశేఖర్ ఓ సినిమా చేశారు. ఇప్పుడీ టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. శతాధిక చిత్రాల దర్శకుడు రామనారాయణ ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కృష్ణదేవ్, అంజన ఇందులో హీరో హీరోయిన్లు. తన శిష్యుడు మామణితో కలిసి రామనారాయణ ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేస్తున్నారు. 
 
 ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా రామనారాయణ మాట్లాడుతూ -‘‘ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. గ్రాఫిక్స్‌కూ ప్రాధాన్యం ఉంటుంది. ఓ కోటీశ్వరుని కుమార్తె కిడ్నాప్‌కి గురైన నేపథ్యంలో సినిమా సాగుతుంది.
 
 ఇందులో ‘వేటగాడు’ ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని తెలిపారు. బ్రహ్మానందం, నాగబాబు, రాజీవ్ కనకాల, సత్యకృష్ణన్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: శ్రీరామ్, మాటలు: టి.రాఘవ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement