16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర!
సాక్షి, హైదరాబాద్: 16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర పడనుంది. ఆరు నెలల ఎదురుచూపులు ఫలించనున్నాయి. వెయిటింగ్ జాబితా లో ఉన్న 16 మందికి పోస్టింగులు దక్కనున్నా యి. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఫైళ్లను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం కోసం పంపారు. సోమవారం పోస్టింగ్ ఉత్తర్వు లు వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం‘సాక్షి’కి తెలిపారు.
ఎందుకింత జాప్యం..
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే (జూన్ 3న) డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 26 మందిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పైరవీలు చేసి కీలకపోస్టులు దక్కించుకున్నారని కొందరిని, తెలంగాణ ప్రాంతం వారు కాదని మరికొందరిని ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆరోపణలొచ్చాయి.
అధికారుల కొరత ఏర్పడడంతో..
వెయింటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లలో తొమ్మిదిమంది ఆంధ్రా, మిగిలిన ఏడుగురు తెలంగాణకు చెందినవారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారులతోపాటు తెలంగాణకు చెందిన డిప్యూ టీ కలెక్టర ్లను కూడా వెయిటింగ్లో ఉంచడంపట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలు, పథకాలను అమ లు చేసేం దుకు తగినంత మంది అధికారులు లేకపోవడం, అరకొరగా ఉన్న అధికారులపైనే పనిభారం పడ డం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్లకు వెంటనే పో స్టుంగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.