విజయనగరంలో వైఎస్సార్సీపీ ధర్నా
విజయనగరం: నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలంటూ సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద నాయకులు ధర్నా చేశారు. చంద్రబాబు వచ్చాక ధనికులు కూడా కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారని అన్నారు. కిలో టమాట రూ.100 లకి చేరిందంటే పరిస్థితి ఏవిధంగా తయారైందో చూడాలన్నారు. వెంటనే ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు దిగివచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘చంద్రన్న రాజ్యం దోపిడీ రాజ్యం’, ‘నిత్యావసర ధరలు ఆకాశంలో ప్రజలు ఉపవాసంలో’ అని మహిళలు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.