Video Shooting
-
ఇది సమంజసమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయమూర్తులకు కేసుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు పంపిస్తారా? బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అలా చేయడం సబబేనా?’’ అని ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ తీరు అసౌకర్యంగా ఉందని, ఇది న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మొదట ఆయన వాదన ప్రారంభిస్తుండగానే ధర్మాసనం కల్పించుకుని.. ‘కోర్టు సమయం ముగిసే లోపు వాదనలు పూర్తవుతాయా?’అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నించేలా ఉన్న ఈ కేసు చాలా తీవ్రమైందని, వాదనలు వినాలని దవే కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా సీబీఐకి కేసు విచారణను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘సిట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉండదా?’’అని ప్రశ్నించగా.. స్థానిక హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేస్తుందని దవే వివరించారు. అసలు ఈ కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారన్న ప్రసక్తే సరికాదని, విలేకరుల సమావేశం నిర్వహిస్తే జోక్యం అనడం సరికాదని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు నిత్యం టీవీల్లో ప్రసారం అవుతున్నాయని, ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణపైనా ప్రసారాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇది అసౌకర్యంగా ఉంది దవే వాదనల మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘సీఎం న్యాయమూర్తులకు ఆడియో, వీడియో క్లిప్పింగులు పంపించడం సమంజసమేనా?’అని ప్రశ్నించింది. సీఎం వ్యవహరించిన తీరు న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయపడింది. అయితే దీనిపై సీఎంను సంప్రదించకుండానే తాను క్షమాపణలు చెప్తున్నానని, ఈ అంశాన్ని మరో కోణంలో చూడాల్సి ఉందని న్యాయవాది దవే ధర్మాసనాన్ని కోరారు. ఈ విధంగా కేసుకు సంబంధించిన క్లిప్పింగులు పంపడం అసౌకర్యంగా ఉందని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొనగా.. విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయొచ్చని దవే సూచించారు. హోలీ సెలవుల తర్వాత విచారణ హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులం వేర్వేరు కాంబినేషన్ల ధర్మాసనాల్లో ఉంటున్నామని.. చీఫ్ జస్టిస్ నుంచి తగిన ఆదేశాలు తీసుకొని, తగిన బెంచ్ ముందు ఈ పిటిషన్‌ను లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు అనుమతించండి ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఐదు గంటల వీడియో, ఆడియో కాల్స్, వాట్సాప్ చాట్లతో కూడిన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనానికి దవే వివరించారు. సిట్ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అంటే ఎలాగని.. హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు అనుమతించాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. అధికార బీజేపీ నేతలపై ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రాంతీయ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూస్తోందని, ఎమ్మెల్యేలను పార్టీ చేర్చుకునేందుకు డబ్బులతో ప్రలోభపెడుతోందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అనే సరికి ఈ కేసు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. దవే వాదనలు కొనసాగిస్తుండగా జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకొంటూ.. కేసుకు సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రికి ఇచ్చారా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 27న తాము కోర్టుకు ఆధారాలను సమర్పించామని, నవంబరు 3న పూర్తి సమాచారంతో కూడిన పెన్‌డ్రైవ్‌ను అందజేశామని దవే తెలిపారు. ‘‘సీఎం కొత్తగా ప్రెస్మీట్లో ఏమీ చెప్పలేదు. చట్టబద్ధమైన పాలనలో ఉన్నాం. కోర్టులు పూర్తిస్థాయి ఆధారాల కోసం చూడాలి. వాస్తవం కళ్లు మూసుకోరాదు. ఇది బీజేపీ లేదా బీఆర్ఎస్ గురించి కాదు. ప్రజాస్వామ్యం గురించి, వారిని అధికారంలోకి తెచ్చిన సామాన్యుల గురించి.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ అవసరం’’ అని ధర్మాసనానికి దవే విన్నవించారు. కాగా.. ఈ కేసులో బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ హాజరయ్యారు. -
భర్త పైశాచికం.. భార్య ఉరేసుకుంటుండగా వీడియో చిత్రీకరణ
ఆత్మకూరు: కుటుంబ కలహాల కారణంగా భార్య ఉరి వేసుకుంటుండగా భర్త వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొంది.. ఆమె మృతికి కారణమైన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మను ఆత్మకూరు పట్టణం దళిత కాలనీకి చెందిన మొద్దు పెంచలయ్యకు ఇచ్చి వివాహం చేశారు. పెంచలయ్య ఓ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొండమ్మ ఆత్మకూరు పట్టణంలోని మెప్మాలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నది. వీరికి ఇద్దరు మగపిల్లలు. 10 సంవత్సరాల వయస్సున్న రెండో కుమారుడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. కొండమ్మపై భర్త పెంచలయ్య అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వారిద్దరూ గొడవపడ్డారు. ఈ సందర్భంగా పెంచలయ్య ‘నువ్వు చస్తేనే సమస్యలు తీరుతాయి’ అని అన్నాడు. దీంతో కొండమ్మ విరక్తి చెంది ఉరేసుకునేందుకు సిద్ధమయ్యింది. ఫ్యాన్‌కు చీర తగిలించి ఉరేసుకుంటూ ఉండగా ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరిస్తూ ‘ఉరేసుకో.. నేను ఆపను’ అంటూ ఆ కసాయి భర్త పైశాచిక ఆనందం పొందాడు. ఉరి బాగా బిగుసుకుపోవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో పెంచలయ్య అక్కడినుంచిపరారయ్యాడు. గమనించిన సమీపంలోని స్థానికులు చూసి కొండమ్మను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందింది. వీడియో వైరల్ కావడంతో మెప్మా సిబ్బంది, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. తల్లి మృతి చెందడంతో తండ్రి దగ్గర లేకపోవడంతో చిన్నారులైన ధనుష్, తరుణ్ ఆస్పత్రి వద్ద దిగాలుగా కూర్చుని ఉండడం పలువురికి కంటనీరు తెప్పించింది. నిందితుడి అరెస్టు.. భార్య కొండమ్మ ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందిన మొద్దు పెంచలయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం రాత్రి ఆత్మకూరు డీఎస్పీ వెల్లడించారు. గురువారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. -
భార్యాభర్తల వీడియో చిత్రీకరించిన ఇద్దరి అరెస్ట్
విశాఖపట్నం సిటీ, అగనంపూడి(గాజువాక): భార్యాభర్తల పడక సన్నివేశాలను వీడీయో చిత్రీకరించిన ఇద్దరు యువకులను దువ్వాడ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివలాలిలా ఉన్నాయి. అగనంపూడి టోల్‌గేటు సమీపంలోని లక్ష్మీగణపతినగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద చిన్నా అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. దీంతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యను తీసుకుని ఆదివారం చిన్నా తన కారు యజమాని ఇంటికి వెళ్లారు. అక్కడ గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా కూర్మన్నపాలేనికి చెందిన కె.చినవాసు, ఎస్.ఉమామహేశ్వరరావులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇది గమనించిన చిన్న కేకలు వేయడంతో వారు పారిపోయారు. చిన్నా ఆదివారం సాయంత్రం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వీడియో తీసుకున్నది మంత్రేనట!
ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండి మంత్రిపదవి కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సందీప్ కుమార్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదని, కనీసం ఆరేడేళ్ల క్రితం నాటిదని సందీప్‌కుమార్‌కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఆయన ఇంకా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టలేదని, అప్పటికి న్యాయ విద్య చదువుతూ ఉన్నారని అంటున్నారు. ఇందులో ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. సదరు వీడియో, ఫొటోలను ఆయనే స్వయంగా తీసుకున్నారని చెబుతున్నారు!! సందీప్ కుమార్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఎక్కడా లేదు. వీడియోలో ఉన్న మహిళలు గానీ, సందీప్ భార్య గానీ ఆయన మీద ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ, వీడియో.. ఫొటోలు ఉన్న సీడీ తనకు అందిన సరిగ్గా అరగంటలోనే ఆయన మంత్రి పదవి ఊడిపోయింది. ''మా మౌలిక విలువల విషయంలో మేమెప్పుడూ రాజీపడే ప్రసక్తి లేదు. తపపుడు పనులను భరించేకంటే ప్రాణాలు వదలడానికే ఇష్టపడతాం'' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగా, ఇలాంటి కేసులోనే అభిషేక్ సింఘ్వి కూడా అన్ని పార్టీ పదవులు, పార్లమెంటరీ కమిటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. నష్ట నియంత్రణ చర్యలలో భాగంగానే సందీప్ కుమార్ మీద కేజ్రీవాల్ చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ప్రదర్శనలు నిర్వహించాయి. తాను ఖండించలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కేజ్రీవాల్ ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారని ఆప్ మాజీ నేత యోగేంద్రయాదవ్ అన్నారు. -
బ్రాండ్ ఫ్యాక్టరీలో మేనేజర్ వికృత చేష్టలు
హైదరాబాద్: బాత్రూమ్లో ఉండగా అమ్మాయిలను మేనేజర్ చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ వికృతచేష్టలు ఎల్బీనగర్ బ్రాండ్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్నాయి. బ్రాండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదుగురు అమ్మాయిలను బాత్ రూమ్ లో ఉండగా చిత్రీకరించి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఎల్పీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేనేజర్ సాగర్ వేరే అమ్మాయితో వీడియోలు తీయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రీకరించిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది.