భార్యాభర్తల వీడియో చిత్రీకరించిన ఇద్దరి అరెస్ట్‌ | two men arrest in video shooting of husband and wife | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల వీడియో చిత్రీకరించిన ఇద్దరి అరెస్ట్‌

Published Tue, Jan 30 2018 9:23 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

two men arrest in video shooting of husband and wife - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం సిటీ, అగనంపూడి(గాజువాక): భార్యాభర్తల పడక సన్నివేశాలను వీడీయో చిత్రీకరించిన ఇద్దరు యువకులను దువ్వాడ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వివలాలిలా ఉన్నాయి. అగనంపూడి టోల్‌గేటు సమీపంలోని లక్ష్మీగణపతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద చిన్నా అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్యతో మనస్పర్థలు ఉన్నాయి.

దీంతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యను తీసుకుని ఆదివారం చిన్నా తన కారు యజమాని ఇంటికి వెళ్లారు. అక్కడ గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా కూర్మన్నపాలేనికి చెందిన కె.చినవాసు, ఎస్‌.ఉమామహేశ్వరరావులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇది గమనించిన చిన్న కేకలు వేయడంతో వారు పారిపోయారు. చిన్నా ఆదివారం సాయంత్రం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిందితులను అరెస్ట్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement