నాస్డాక్లో వీడియోకాన్ డీ2హెచ్ లిస్టింగ్
32.5 కోట్ల డాలర్ల ఏడీఆర్‌ల సమీకరణ
న్యూయార్క్: భారత్‌లో డెరైక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలందించే వీడియోకాన్ డీ2హెచ్ కంపెనీ అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్(నాస్డాక్)లో లిస్టయింది. అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్(ఏడీఆర్)ద్వారా ఈ కంపెనీ 32.5 కోట్ల డాలర్లు సమీకరించింది. లిస్టింగ్ సందర్భంగా భారత ఎంపీ రాజ్‌కుమార్ ధూత్, వీడియోకాన్ డీ2హెచ్ ఎండీ సౌరభ్ ధూత్‌లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ బెల్‌ను మోగించారు. నాస్డాక్లో లిస్టింగ్ కావడం తమ కంపెనీ చరిత్రలోనే కాకుండా మొత్తం భారత మీడియా పరిశ్రమకు కీలకమైన మైలురాయని సౌరభ్ ధూత్ చెప్పారు. 2000 సంవత్సరం తర్వాత విదేశాల్లో లిస్టైన తొలి భారత ప్రైవేట్ కంపెనీ ఇదే. అంతేకాకుండా నాస్డాక్లో లిస్టైన తొలి భారత మీడియా కంపెనీ కూడా ఇదే.