vidyaranya nagar
-
విద్యారణ్య నగర్లో చోరీ
అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని విద్యారణ్యనగర్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రిటైర్డ్ టీచర్ ప్రకాష్‌రెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఊరికి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని పసిగట్టిన దొంగలు ఆదివారం రాత్రి చొరబడ్డారు. బీరువాలోని పది తులాల బంగారు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. వీటి విలువ రూ.1.80 లక్షలు ఉంటుందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరాలకు వెళ్తే నగలు మాయం
అనంతపురం సెంట్రల్ : పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు లూటీ చేసిన సంఘటన అనంతపురం విద్యారణ్య నగర్లో వెలుగు చూసింది. స్థానిక రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం... విద్యారణ్య నగర్‌కు చెందిన రవికుమార్ కార్ల అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలసి జీడీపల్లి జలాశయం వద్ద పుష్కరాలకు ఆదివారం ఉదయం బయలుదేరివెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటిలోని బీరువా తలుపు పగులగొట్టి అందులోని ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.