అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని విద్యారణ్యనగర్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రిటైర్డ్ టీచర్ ప్రకాష్‌రెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఊరికి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని పసిగట్టిన దొంగలు ఆదివారం రాత్రి చొరబడ్డారు. బీరువాలోని పది తులాల బంగారు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. వీటి విలువ రూ.1.80 లక్షలు ఉంటుందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.