Vijay Pratap Singh
-
పని ఒత్తిడి ఎక్కువై.. ముగ్గురిని చంపేశాడు!
భద్రతా దళాలకు పని ఒత్తిడి ఎక్కువ కావడం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో సీఐఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రతాప్ సింగ్ బుధవారం తెల్లవారుజామున సహచరులపై కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చి, మరో ఇద్దరిని గాయపర్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నరోరా అణు విద్యుత్ ప్లాంటు నుంచి ఇటీవలే అతడు కల్పకం ప్లాంటుకు బదిలీ మీద వచ్చాడు. ఇక్కడ పని ఒత్తిడి బాగా ఎక్కువ కావడం, దానికితోడు ఇంటికి దూరంగా ఉండటంతో భరించలేకపోయాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలోకల్పకం టౌన్షిప్లో సీఐఎస్ఎఫ్ జవాన్లంతా రోల్ కాల్‌కు వెళ్తారు. మొత్తం 110 మంది జవాన్లు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో విజయ్ ప్రతాప్ సింగ్ ముందుగా ఆయుధాల స్టోర్స్‌కు వెళ్లి, అక్కడినుంచి 9 ఎంఎం స్టెన్ గన్, 60 బుల్లెట్లు తీసుకున్నాడు. ముందుగా బ్యారక్స్‌లోని మొదటి అంతస్థుకు చేరుకుని, అక్కడ సిబ్బందికి డ్యూటీలు వేసే మోహన్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌కు చెందిన అతడు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత పోర్టికోలోకి వెళ్లి అక్కడ విధులకు హాజరవుతున్న బలగాలపై కాల్పులు జరిపాడు. దాంతో సేలంకు చెందిన ఏఎస్ఐ గణేశన్ (58), మదురైకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు (54) కూడా మరణించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఏఎస్ఐ ప్రతాప్ సింగ్, జమ్ము కాశ్మీర్‌కు చెందిన కానిస్టేబుల్ గోవర్ధన ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఎలాగోలా సహచరులు విజయ్ ప్రతాప్ సింగ్‌ను పట్టుకుని, ఒక గదిలో వేసి తాళం పెట్టారు. తర్వాత పోలీసులు అతడి మీద ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద కేసులు పెట్టారు. -
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో దుశ్చర్య చెన్నై, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్యాంపులో తన పైఅధికారి, సాటి జవాన్లపై ఓ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. తమిళనాడులోని కాంచీపురం కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో ఐదు వేల మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన అణు విద్యుత్ కేంద్రం కావడంతో 500 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు షిఫ్టుల వారీగా బందోబస్తులో ఉంటారు. వీరి కోసం కల్పాక్కంనగర్‌లో బ్యారక్స్ క్యాంప్ ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్థాయి జవాను విజయ్ ప్రతాప్ సింగ్ (57) బుధవారం తెల్లవారుజామున బ్యారెక్స్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న తన పైఅధికారి, రాజస్థాన్‌కు చెందిన మోహన్‌సింగ్ (42)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. తుపాకీ శబ్దం విని కొందరు జవాన్లు బ్యారెక్స్ వద్దకు రాగా వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సేలంకు చెందిన స్పెషల్ ఎస్ఐ గణేశన్ (38), మదురైకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజ్ (42) మృతి చెందారు. విజయ్ ప్రతాప్ సింగ్‌ను తోటి జవాన్లు పట్టుకుని తుపాకీ లాక్కున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ప్రతాప్ సింగ్ కొంతకాలంగా పైఅధికారులపై కోపంగా ఉన్నాడని, మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడని తోటి జవాన్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కాల్పులకు కారణాలను తెలుసుకుంటున్నారు.