బీసీలకు భూములు కేటాయించాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు భూములు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాకు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన రెండు రోజుల దీక్షలో పాల్గొన్న ఆమె ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీల్లో అధిక సంఖ్యలో భూమి లేని నిరుపేదలున్నారన్నారు.
బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడలేదని పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ఉద్యమాన్ని గ్రామీణస్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. రెండు రోజుల దీక్షలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్, మారుబోయిన శ్రీనివాసులు, బైనా సుధాకర్, దాసరి రాజేంద్ర, మూగ శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం, షేక్ రెహమాన్, గుర్రం శ్రీనివాసులు పాల్గొన్నారు.