Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి.