Vinesh
-
అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం!
ఆదిలాబాద్: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని పా లుండిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై దుబ్బక సునీల్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఉట్నూర్ మండలంలోని చింతకర గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, కమలబాయి దంపతులకు కుమారుడు వినేష్(22) ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. అయితే మండలంలోని పాలుండిగూడ గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఆ యువతితో పెళ్లి విషయంలో వినేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పుడప్పుడు పాలుండిగూడకు వెళ్లి సదరు యువతిని కలిసేవాడు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి పాలుండిగూడ గ్రామంలో అతడి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాడు. రాత్రి బహిర్భూమికి వెళ్తానని బంధువులకు చెప్పి బయటకు వచ్చిన వినేష్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో యువకుడి బంధువులైన గజానంద్, కేశవ్‌లు గాలించగా బరద్వల్ బహుదుర్‌సింగ్ వ్యవసాయ చేనులో స్పృహ కోల్పోయి కనిపించాడు. ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శనివారం ఉదయం పాలుండిగూడ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వినేష్ మృతితో చింతకర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇవి చదవండి: వరుసకు చెల్లి.. అయినా ప్రేమ పెళ్లి.. కానీ చివరికి? -
ముంబై మహారథి శుభారంభం
పంచ్‌కులా (హరియాణా): ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సభ్యురాలిగా ఉన్న ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి పోటీలో ముంబై మహారథి 4–3తో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. 53 కేజీల బౌట్లో వినేశ్ (ముంబై) 8–0తో అంజుపై గెలిచింది. ముంబై తరఫున ఇలియాసోవ్ (57 కేజీలు), సచిన్ రాఠి (74 కేజీలు), నెమెత్ (76 కేజీలు) కూడా విజయం సాధించారు. పంజాబ్ రాయల్స్ తరఫున 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత బజరంగ్ పూనియా 8–2తో హర్ఫుల్పై గెలిచాడు. -
సాక్షి, వినేశ్ కూడా అవుట్
పారిస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (60 కేజీలు), వినేశ్ ఫోగట్ (48 కేజీలు) కూడా ఈ మెగా ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లలో సాక్షి 1–3తో ల్యూసా నైమెష్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలవ్వగా, వినేశ్‌పై విక్టోరియా ఆంథోని (అమెరికా)పైచేయి సాధించింది. వీరితో పాటు శీతల్ తోమర్ (53 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన శీతల్ ప్రిక్వార్టర్స్‌లో 10–0తో గెలుపొంది, క్వార్టర్స్‌లో 2–4తో ఎస్టేరా డోబ్రే (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. నవ్‌జ్యోత్ కౌర్ 5–10తో ఆకిర్బాట్ నసన్‌బుర్మా (మంగోలియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఇక భారత్ పతక ఆశలన్నీ ఆసియన్ చాంపియన్ బజ్రంగ్ పూనియా (65కేజీలు), ఒలింపియన్ సందీప్ తోమర్ (57 కేజీలు)లపైనే ఉన్నాయి.