visakapatnam sbi-sca branch
-
240 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, మాడుగుల : మండలంలో విశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రెండు కార్లలో తరలిస్తున్న 240 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్.వి.ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు తాటిపర్తి చెక్ పోస్టు వద్దకు వెళుతుండగా తమను గమనించిన నిందితులు కార్లు, గంజాయి మూటలను వదిలి పరారయ్యారన్నారు. గంజాయి, కార్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.ఐ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్నముగ్గురు మహిళల అరెస్ట్ ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : గిరిజన ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. సర్కిల్ – 4 ఎక్సైజ్ సీఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన కొంతమంది ఢిల్లీలో నివసిస్తున్నారు. వీరిలో ఐదుగురు విశాఖలోని గిరిజన ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీ తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ వినయ్‌కుమార్ సిబ్బందితో ఎన్ఏడీ కూడలిలో మాటువేసి పట్టుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు చిక్కగా, ఇద్దరు తప్పించుకున్నారు. 18 కిలోల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని చెబుతున్నారు. మహిళలతోపాటు బైక్, గంజా యిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సర్కిల్ – 4 ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో ఎన్నికలకు ముందు పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బును కోయంబత్తూరుకు తరలించి.. ఆర్బీఐ, ఎస్బీఐ, ఐటీ అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు. ఈ డబ్బును కంటెయినర్లలో తరలిస్తుండగా తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు ఈ డబ్బు తమదేనని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులకు వివరాలు అందజేశారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఈ డబ్బును ఇంకా బ్యాంక్ అధికారులకు అప్పగించలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
ఆ 570 కోట్ల రూపాయల నగదు మాదే
విశాఖపట్నం: తమిళనాడులో కంటెయినర్లలో తరలిస్తుండగా పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై మిస్టరీ వీడింది. ఈ డబ్బు తమదేనని విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. నగదు కావాలని ఈ నెల 11న రిజర్వ్బ్యాంక్ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. విమానంలో డబ్బు తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయని, దీంతో ఎస్కార్టుతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. డబ్బును తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్టును పంపించామని తెలిపారు. తమిళనాడు పోలీసులకు డబ్బుకు సంబంధించిన ఆధారాలిచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది.