ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ | election commission officers quizzing 570 crores seized incident | Sakshi
Sakshi News home page

ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ

Published Tue, May 17 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ

ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ

కోయంబత్తూరు: తమిళనాడులో ఎన్నికలకు ముందు పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బును కోయంబత్తూరుకు తరలించి.. ఆర్బీఐ, ఎస్బీఐ, ఐటీ అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు.

ఈ డబ్బును కంటెయినర్లలో తరలిస్తుండగా తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు ఈ డబ్బు తమదేనని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులకు వివరాలు అందజేశారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఈ డబ్బును ఇంకా బ్యాంక్ అధికారులకు అప్పగించలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement