tamilnadu assembly elections
-
రీ పోలింగ్ కోరుతా!: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: ఓటుకు నోటు, టోకెన్ల పంపిణీ అంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయని, ఈ దృష్ట్యా, పరిస్థితులను బట్టి రీపోలింగ్ కోరుతామని మక్కల్ నీది మయ్యం నేత కమల్ తెలిపారు. కుమార్తెలు అక్షర, శ్రుతిహాసన్‌లతో కలిసి ఉదయాన్నే మైలాపూర్‌లో ఓటు హక్కును కమల్ వినియోగించుకున్నారు. ఈ ముగ్గురు క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం తాను పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కుమార్తెలతో పాటు కమల్ వెళ్లారు. పలు పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. కోంపట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరు పంపిణీ చేశారో ఆధారాలు సహా తన వద్ద ఉన్నాయని, ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రీపోలింగ్‌కు పట్టుబడుతామని, ఒక్క కోవై దక్షిణంలోనే కాదు, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఈ తంతు సాగినట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. నామల్ తమిళర్ కట్చి నేత సీమాన్ వలసరవాక్కంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంత రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నగదు తాండవం చేసిందని, కట్టడిలో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా? -
అభిమానులపై అజిత్ ఆగ్రహం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. తమిళ హీరో అజిత్ తన భార్య షాలినీతో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటు వేసి బయటకు వచ్చిన హీరో అజిత్‌తో సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఇబ్బందిపడిన అజిత్ ఓ అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అభిమానులపై అజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలు పోలింగ్ సమయంలో చాలా కూల్‌గా లైన్లో వేచి ఉండి మరీ ఓటు వేసే అజిత్ అభిమానుల గందరగోళానికి ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. సింప్లిసిటీతో ఉండే అజిత్ క్యూలైన్లో ఓటు వేయడానికి నిల్చోవడంతో అభిమానులు తమ హీరోతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. చుట్టు చేరిన అభిమానల తాకిడితో అజిత్ ఒకింత అసహనానికి గురయ్యారు.ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఓటు హక్కు వినియోగించుకున్న హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తీఓటు హక్కు వినియోగించుకున్న నటుడు కమల్ హాసన్, తన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళనాడు ఎన్నికలు: గంటల వ్యవధిలో 428 కోట్లు సీజ్
చెన్నై: మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. చదవండి: బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు.. -
ఆ ప్రాంతంలో పర్యటించిన మొదటి ప్రధాని మోదీనే
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీనేనని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఈరోడ్‌లో జరిగిన రోడ్ షోలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాఫ్నాలో బాంబ్ దాడి నిర్వాసితులకు కేంద్రం సాయం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా జాఫ్నాలో పర్యటించలేదన్నారు. అక్కడ పర్యటించడమే కాకుండా బాంబు దాడి నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేశారని నడ్డా గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మైనారిటీలైన తమిళులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశపు తొలి మహిళా రక్షణ మంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ - ఇద్దరూ తమిళనాడుకు చెందినవారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమిళనాడులో భూకబ్జాలను,గూండాయిజం, విద్యుత్ కోతలు ఆగాలంటే అన్నాడీఎంకే-బీజేపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని నడ్డా ఓటర్లను అభ్యర్థించారు. కాగా, ఏప్రిల్ 6న తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగనుంది. ( చదవండి: TN Assembly Polls: కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం ) -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
కాబోయే సీఎం స్టాలినే.. నేను గ్యారంటీ
-
కాబోయే సీఎం స్టాలినే.. నేను గ్యారంటీ
చెన్నై : ఈ సారి తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలినేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోష్యం చెప్పారు. అందుకు తాను గ్యారంటీ అని అన్నారు. ఆదివారం సేలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓట్లరను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ నేను గ్యారంటీ ఇస్తున్నాను. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్టాలినే. ఓ నిర్ణయం అయితే జరిగిపోయింది. ఎన్నికల్లో తేలాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల వద్ద లెక్కలేనంత డబ్బు ఉంది. వాళ్లను అడ్డుకోవాలి. ముందు తమిళనాడులోనుంచి వాళ్లను బయటకు నెట్టాలి. తర్వాత ఢిల్లీ పీఠంనుంచి కూడా. తమిళనాడు ఆలోచనలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోంది. దాన్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు. ఈ దాడి వెనుక పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. తమిళనాడు వ్యక్తి ఎవరూ కూడా అమిత్ షా, మోహన్ భగవత్ కాళ్లను పట్టుకోవాలనుకోడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ముఖ్యమంత్రి ఎందుకు ఆర్ఎస్ఎస్కు అమిత్ షాకు లొంగిపోయారు. అవినీతి పరుడైన కారణంగానే ముఖ్యమంత్రి అమిత్ షాకు లొంగిపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రజల డబ్బు దొంగిలించిన కారణంగా వలలో ఇరుక్కుపోయారు’’ అని అన్నారు. చదవండి, చదివించండి : మీ మైండ్ గేమ్స్ ఇక్కడ పనిచేయవు : ఎంపీ -
తమిళనాడు ఎన్నికల్లో ‘రంగం’ సినిమా రిపీట్
‘రంగం’ సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 36 మంది యువకులు తలపండిన రాజకీయ నాయకులను ఢీకొననున్నారు. ఆ యువశక్తి వెంట ఓ శక్తి ఉంది. ఆయనే యు.సగాయం. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఎన్నికల రాజకీయాల్లోకి దింపనున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సగాయం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తమిళనాడు ఇలయంగ్ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. అందులో అంతా యువకులే పని చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను వాడుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 20 స్థానాల్లో తమ పార్టీ తరఫున యువకులు పోటీ చేస్తున్నట్లు ఆ మాజీ ఐఏఎస్ అధికారి సగాయం ప్రకటించారు. ఈ మేరకు వారిలో కొంత మంది సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కొలాత్‌పూర్, రోయాపూర్, అన్నానగర్, అవడీ, అలాందుర్, మధురవోయల్, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో ఆయన శిష్యులు పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి తమకు లేదని.. అందుకే విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నట్లు సగాయం మీడియాకు చెప్పారు. ఇది మొదటి అడుగు.. అని ప్రజల్లోకి ఉద్యమం తీసుకెళ్లేందుకు ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో మొత్తం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమని సగాయం ప్రకటించారు. అయితే ముఖ్యమంతత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం. సగాయం గతంలో మధురైలో అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఐఏఎస్‌గా ఉన్న సమయంలో తన పనితీరుతో అందరికీ కంట్లో నలుసుగా ఉన్నారు. అందుకే ఆ బాధ్యతల్లో ఉన్న 27 ఏళ్లల్లో అనేకసార్లు బదిలీలు జరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే అని సగాయం ప్రకటిస్తున్నారు. -
సాక్షి కార్టూన్ 14-03-2021
-
రాజకీయాల్లోకి రజనీ
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ (66) రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న ఊగిసలాటకి ఎట్టకేలకి తలైవా తెరదించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు. ‘‘మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తాం. నీతి నిజాయితీ, పారదర్శకత, అవినీతిరహిత రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఈసారి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి’’అని రజనీ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు, మేము మారుస్తాం. మేము అన్నింటినీ మారుస్తాం అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జత చేరుస్తూ రజనీ తన రాజకీయ అరంగేట్రం ప్రకటన చేశారు. రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ స్పష్టతనివ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చెన్నై కోడంబాక్కంలో శ్రీరాఘవేంద్రస్వామి కల్యాణమండపం వద్ద బాణా సంచా కాల్చారు. నగర వీధుల్లో తిరుగుతూ లడ్డూలు పంచిపెట్టారు. గెలుపోటములకు మీదే బాధ్యత సోషల్ మీడియాలో రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేశాక రజనీకాంత్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల తలరాత మార్చడం ఎంతో అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ అది సాధ్యం కాదని, తమిళ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా తన పొలిటికల్ ఎంట్రీ కాస్త ఆలస్యమైందన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడమంటే అది ప్రజా విజయమేనన్న రజనీ ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే అది ప్రజా విజయం, ఒకవేళ నేను ఓడిపోతే కూడా అది వాళ్ల పరాజయమే. నా గెలుపు మీ గెలుపు ఎలాగో, నా ఓటమి మీ ఓటమి కూడా. అంతా మీ చేతుల్లోనే ఉంది’’అని వ్యాఖ్యానించారు. గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ పేరిట రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవడంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు. బీజేపీ ప్రముఖునికి పదవి బీజేపీ మేధావుల విభాగం తమిళనాడు అధ్యక్షుడు అర్జున్ మూర్తి రజనీ కొత్త పార్టీకి సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ పర్యవేక్షకుడిగా గాంధీ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ను నియమించారు. రజనీతోపాటు వీరిద్దరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికలకు రెడీ: రజనీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. అభిమానులు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారనీ, వాటిని వమ్ముచేయబోనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీచేస్తామన్నారు. రాష్ట్రంలో 38 లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. రజనీకాంత్ కుడిచేతి వేలిపై సిరాచుక్క చెన్నైలో పోలింగ్ సందర్భంగా ఓటేసిన రజనీకాంత్‌కు ఎడమచేతి చూపుడువేలిపై కాకుండా కుడిచేతి చూపుడు వేలిపై అధికారులు సిరాచుక్క పెట్టారు. నిబంధనల ప్రకారం.. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు వేయాలి. కుదరకుంటే తర్వాతి వేలికి, లేదంటే ఆతర్వాతి వేలికి చుక్క పెట్టాలి. కానీ, ఎన్నికల అధికారి తప్పిదం చేశారని, అధికారిపై చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెప్పారు. -
మా టార్గెట్ 2021: రజనీకాంత్
సాక్షి, చెన్నై : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్ స్టార్, రజనీ మక్కల్ మండ్రం అధినేత రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయమని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘రూ. 570 కోట్ల’ వ్యవహారంపై సీబీఐ విచారణ
తమిళనాడు ఎన్నికల సమయంలో రవాణా అవుతూ పట్టుబడిన రూ. 570 కోట్ల విషయంలో సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా తగిన ఆధారాలుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా సీబీఐకి కోర్టు తెలిపింది. ఆ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదంటూ చెబుతున్న అంశంలో వాస్తవికతను అనుమానిస్తూ ఇళంగోవన్ పిటిషన్ దాఖలుచేశారు. మే 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, సరిగ్గా 13వ తేదీన ఎన్నికల కమిషన్ నిఘా బృందం తిరుపూర్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కంటెయినర్లను వెంటాడి పట్టుకుని చూడగా అందులో రూ. 570 కోట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ కంటెయినర్లను తిరుపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం క్యాష్ చెస్ట్‌కు ఆ డబ్బు తరలిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అయితే, అంత పెద్ద మొత్తాన్ని తరలిస్తుంటే స్థానిక పోలీసుల ఎస్కార్టు ఉండాలని, అలా ఏమీ జరగలేదని ఇళంగోవన్ అంటున్నారు. పైగా డబ్బు తరలిస్తున్నట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు ఏమీ లేవని తెలిపారు. -
కోయంబత్తూరుకు కదిలిన నోట్ల కట్టలు
- 195 బాక్సుల్లో నోట్ల కట్టలు - లెక్కింపు పర్వం పూర్తి - ఇంకా ఈసీ గుప్పెట్లో రూ.570 కోట్లు - ఢిల్లీకి నివేదిక సాక్షి, చెన్నై: తిరుపూర్ కలెక్టరేట్ నుంచి నోట్ల కట్టలతో కూడిన కంటైనర్లు కోయంబత్తూరుకు కదిలాయి. అక్కడి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో నోట్ల కట్టల లెక్కింపు పర్వం ముగిసింది. అయితే అధికార పూర్వకంగా ఆ నగదును ఎస్బీఐ వర్గాలకు అప్పగించనున్నట్టు సమాచారం. లెక్కింపు పర్వంతో నివేదికను ఢిల్లీకి పంపించి తదుపరి ఈ వ్యవహారాన్ని ఎన్నికల యంత్రాంగం కొలిక్కి తీసుకురానున్నది. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా సాగిన తనిఖీల్లో తిరుపూర్‌లో పట్టుబడ్డ మూడు లారీల వైపు రాష్ట్రం చూపు మరలింది. ఆ లారీల్లో రూ.570 కోట్లు ఉన్నట్లు తేలడంతో ఆ నగదు ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఓటర్లకు పంచే యత్నంలో భాగంగానే ఈ కంటైనర్లు రాష్ట్రంలోకి వచ్చినట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఆ నగదు తమదేనంటూ ఎస్బీఐ ముందుకు రావడంతో ఆ లారీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి వచ్చింది. నాలుగు రోజులపాటుగా ఆ కంటైనర్ లారీలను తిరుపూర్ కలెక్టరేట్ వద్ద గట్టి భద్రత నడమ ఉంచారు. ఎన్నికల పర్వం ముగియడంతో ఆ కంటైనర్లు అక్కడి నుంచి కదిలాయి. వీటిని భారీ భద్రత నడుమ కోయంబత్తూరులోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాంక్ వర్గాలు, ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల పర్యవేక్షకుల సమయంలో ఆ నగదును లెక్కించే పనిలో పడ్డారు. ఒక కంటైనర్‌లో 60, మరో కంటైనర్‌లో 65, ఇంకో కంటైనర్‌లో 70 చొప్పున మొత్తం 195 బాక్సుల్లో రూ.వంద, రూ.ఐదువందలు, రూ.వెయ్యి నోట్లు ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. ఆ నగదు లెక్కింపు ప్రక్రియను ఆరుగంటల పాటుగా అధికార వర్గాలు నిర్వహించాయి. మంగళవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో లెక్కింపు పర్వం ముగియగానే, ఆదాయ పన్ను, ఎన్నికల అధికారులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే ఆ నగదు ఎస్బీఐకు అప్పగింత తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నిఘా నేత్రాల నడుమ సాగిన ఈ లెక్కింపులో ఎంత మొత్తం నగదు ఉన్నదో పరిశీలించి, అందుకు తగ్గ నివేదికను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీకి సమర్పించనున్నారు. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషనర్ నజీం జైదీకి పంపించి, ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు ఎస్బీఐకు అధికార పూర్వకంగా ఆ నగదు అప్పగించబోతున్నారు. దీంతో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం నిఘా వలయంలోకి తీసుకొచ్చి ఉన్నారు. కంటైనర్లు పట్టుబడ్డ సమయంలో రూ.570 కోట్లు ఉన్నట్టుగా సంబంధిత అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, తాజా లెక్కింపులో అంత కన్నా ఎక్కువగా ఉంటే, ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో ఎన్నికలకు ముందు పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బును కోయంబత్తూరుకు తరలించి.. ఆర్బీఐ, ఎస్బీఐ, ఐటీ అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు. ఈ డబ్బును కంటెయినర్లలో తరలిస్తుండగా తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు ఈ డబ్బు తమదేనని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులకు వివరాలు అందజేశారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఈ డబ్బును ఇంకా బ్యాంక్ అధికారులకు అప్పగించలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
కంటైనర్లలో రూ.570 కోట్లు
♦ తమిళనాడులో స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు ♦ ఆ డబ్బు మాదే: ఎస్బీఐ సాక్షి ప్రతినిధి, చెన్నై: కోటి .. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ. 570 కోట్లు. అంత మొత్తం చూసేసరికి తనిఖీలు చేస్తోన్న ఎన్నికల అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజమా.. కలా అంటూ నోరెళ్ల బెట్టారు. ఎన్నికలకు మరో రెండ్రోజులు ఉందనగా తమిళనాడులోని తిరుపూరు జిల్లా సెంగపల్లి సమీపంలో రూ.570 కోట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాల్ని తనిఖీ చేస్తూ.. మూడు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించారు. కంటైనర్లతో పాటు వెంట కాపలా ఉన్న మూడు కార్లు ఆగకుండా వెళ్లడంతో చెంగపల్లి వద్ద వెంబడించి పట్టుకున్నారు. కంటైనర్లను తనిఖీ చేయగా పెట్టెల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ డబ్బును కొయంబత్తూరు ఎస్బీఐ బ్రాంచి నుంచి విశాఖపట్నం బ్రాంచ్‌కు తీసుకెళ్తున్నామని, తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులమంటూ కార్లలోని సిబ్బంది వెల్లడించారు. కార్లను వెంబడించడంతో దోపిడీ జరుగుతోందని భయపడి ఆపకుండా వెళ్లినట్లు వారు చెప్పారు. అయితే సరైన పత్రాలు చూపకపోవడంతో పారా మిలటరీ సిబ్బంది సాయంతో కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. డబ్బుకు సంబంధించిన జిరాక్స్ పేపర్లు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విషయాన్ని ఎస్బీఐ అధికారులకు తెలియచేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సమర్పించారు. ఆ డబ్బును ఆంధ్రాకు తీసుకెళ్తున్నాం: ఎస్బీఐ తమిళనాడులో పట్టుబడ్డ రూ. 570 కోట్ల నగదు తమదేనంటూ ఎస్బీఐ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరతను తీర్చేందుకు ఆర్బీఐ కోరడంతో డబ్బును తరలిస్తున్నామని తెలిపింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు కొయంబత్తూర్ ఎస్బీఐ కోశాగారం నుంచి ఏపీ పోలీసుల రక్షణలో తీసుకెళ్తుండగా ఎన్నికల అధికారులు పట్టుకున్నారంటూ ఆ ప్రకటనలో వెల్లడించింది. చెన్నై, కొయంబత్తూరు, తిరుపూర్‌లోని బ్యాంకు సిబ్బంది ఎన్నికల అధికారులకు అన్ని వివరాలు సమర్పించారని చెప్పింది. -
నన్ను గెలిపిస్తే.. తెలుగోడి శక్తిని తెలియజేస్తా!
తమిళనాడు: తమిళనాడులో జయలలిత పోటీచేస్తున్న ఆర్కె నగర్, హోసూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన జయలలితకు ప్రత్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉండగా, హోసూరులో ఒక లక్ష ఎనభై వేలమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభ్యర్థించారు. తమిళనాడు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. తమిళనాడులో ద్విభాషా విద్యావిధానం అమలులో ఉందని, దీనికి బదులుగా త్రిభాష విద్యా విధానం అమలు చేయాలని, ఉగాది పండుగను ప్రభుత్వ పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కేతిరెడ్డి చెప్పారు. తమిళనాడులో అన్నీ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 35 మంది శాసన సభ్యులు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అయితే తెలుగు వారి సమస్యలపై వారు ఏనాడు స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకుంటే తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తానని.. తెలుగు వాడి శక్తిని పాలకులకు తెలియజేస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
ఆ 570 కోట్ల రూపాయల నగదు మాదే
విశాఖపట్నం: తమిళనాడులో కంటెయినర్లలో తరలిస్తుండగా పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై మిస్టరీ వీడింది. ఈ డబ్బు తమదేనని విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. నగదు కావాలని ఈ నెల 11న రిజర్వ్బ్యాంక్ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. విమానంలో డబ్బు తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయని, దీంతో ఎస్కార్టుతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. డబ్బును తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్టును పంపించామని తెలిపారు. తమిళనాడు పోలీసులకు డబ్బుకు సంబంధించిన ఆధారాలిచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది. -
ఆ కంటెయినర్ల వెనుక మరో మూడు కార్లు!
తమిళనాడులో ఎన్నికలకు ముందు దొరికిన రూ. 570 కోట్ల నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది. అయితే.. ఈ మూడు కంటెయినర్లను వెనక నుంచి మూడు కార్లు కూడా ఫాలో అవుతున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. పోలీసులు ఆపగానే కంటెయినర్లను వదిలిపెట్టి మూడు కార్లు వెనక్కి తిప్పి తీసుకెళ్లిపోయారు. ఈ మూడు కార్లను పోలీసులు వెంటాడి చెంగపల్లి సమీపంలో పట్టుకున్నారు. కార్లలో ఉన్న వ్యక్తులను తమిళనాడు పోలీసులు ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని వారు చెప్పారు. పోలీసు యూనిఫాం వేసుకోలేదమని ప్రశ్నించగా సమాధానం లేదు. పోనీ ఐడీ కార్డులు ఏవని అడిగినా చూపించలేకపోయారు. కంటెయినర్లు ఆపితే మీరెందుకు పారిపోయారని ప్రశ్నిస్తే.. దొంగలు వచ్చారనుకుని పారిపోయామన్నారు. వాళ్లను పట్టుకున్న పోలీసులు.. కలెక్టర్, ఎస్పీల వద్ద ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్లు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దాంతో.. ఎస్బీఐ లేదా ఆర్బీఐ నుంచి తగిన వివరాలతో కూడిన లేఖలు తమకు అందిన తర్వాత మాత్రమే నగదు విడిచిపెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇంతవరకు అసలు ఆ నగదు గురించి అటు బ్యాంకు వర్గాలు గానీ, ఇటు ఆర్బీఐ గానీ తమిళనాడు పోలీసులను సంప్రదించలేదు. ఆధారాలు ఏమైనా వస్తే నగదు పంపిస్తామని, లేనిపక్షంలో దీని వెనుక ఉన్నవాళ్లమీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకు కోయంబత్తూరులో లారీలు బయల్దేరగా, 12.40 గంటలకే వాటిని తిరుపూరు సమీపంలో పట్టుకున్నారు. అంత అర్ధరాత్రి సమయంలో అసలు అంత పెద్ద మొత్తాన్ని, అది కూడా సెక్యూరిటీ లేకుండా ఎలా పంపారో అర్థం కావట్లేదు. అంత నగదు తరలిస్తుంటే చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి వెంట ఉండాలి. కానీ ఎవరూ లేరు. వాళ్ల వద్ద ఉన్న ఇన్వాయిస్లో కూడా సూరిబాబు అనే వ్యక్తి ద్వారా విశాఖపట్నంలోని బాలాజీనగర్ మెయిన్ బ్రాంచికి తరలిస్తున్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఆర్బీఐ అనుమతితోపాటు తగినంత సెక్యూరిటీ కూడా ఉండాలి. కానీ అవేవీ లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కసారిగా వైజాగ్ బ్రాంచికి ఇంత పెద్ద మొత్తం తరలించడం ఎందుకని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల కోసం తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కంటెయినర్లను ముందు ఆపకపోవడంతో.. తర్వాత పట్టుకున్నాక కూడా వాటిలో ఉన్నవాళ్లు అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడం అన్నీ అనుమానాలను బలపరిచాయి. -
రూ.570కోట్లపై స్పందించిన విశాల్
తమిళనాట సినీరంగానికి, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే రాజకీయంగా జరిగే ప్రతీ పరిణామం పై సినీతారలు తమ అభిప్రాయాలను చెపుతుంటారు. తాజాగా నడిగర్ సంఘం వివాదంతో పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారిన యంగ్ హీరో విశాల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తాజాగా తమిళనాడు ఎలక్షన్ల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు దొరకటం ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంటంతో తమిళనాట డబ్బు ఏరులై పారుతోంది. కనివినీ ఎరుగని రీతిలో ఒకేసారి మూడు కంటైనర్ లలో 570 కోట్ల డబ్బు దొరకటం సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలకు కూడా షాక్ ఇచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన ఆ భారీ నగదును చిన్న పిల్లల చదువు, మధ్యాహ్న భోజన పథకాలకు వినియోగించాలంటూ సలహా ఇచ్చాడు విశాల్. 570 cr seized in Tirupur without documents??? wish they use it for children education n mid day meal scheme.wil b enuf for 570cr kids — Vishal (@VishalKOfficial) 14 May 2016 -
కంటైనర్లలో రూ.570కోట్లు స్వాధీనం
కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు ఏరులై పారుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గతరాత్రి తనిఖీల్లో భాగంగా కోయంబత్తూరు, తిర్పూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. కోయంబత్తూరు బైపాస్ రోడ్డు వద్ద ఓ కంటైనర్‌లో రూ.195 కోట్లు సీజ్ చేయగా, తిర్పూరు జిల్లాలో మూడు కంటైనర్లను ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ స్వాధీనం చేసుకుంది. ఆ కంటైనర్లలో రూ.570 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కంటైనర్లు కోయంబత్తూరు నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం. అధికారుల విచారణలో భాగంగా విజయవాడ ఎస్బీఐ బ్యాంక్‌లో నగదును డిపాజిట్ చేసేందుకు వెళుతున్నట్లు కంటైనర్ డ్రైవర్ తెలిపాడు. స్వాధీనం చేసుకున్న కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. నగదు తరలింపుపై విచారణ జరుపుతున్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజేశ్ లహోని తెలిపారు. కాగా కంటైనర్లతో పాటు ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు, సంస్థ యూనిఫాంలో లేడని, అంతేకాకుండా నగదు తరలింపుపై అతని వద్ద పూర్తి వివరాలతో కూడిన పత్రాలు లేవన్నారు. కాగా ఈనెల 16వ తేదీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు యధేచ్చగా నగదు పంపిణీలో నిమగ్నమైపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తమిళనాడులో సుమారు రూ.100 కోట్లు అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత భారీగా నగదును సీజ్ చేయడం దేశంలోనే ప్రథమం. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
స్వామి... సారొచ్చొరు
చెన్నై: రాష్ట్రంలో అసెంబీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతుండగా అకస్మాత్తుగా ఇద్దరు ప్రముఖులు రంగ ప్రవేశం చేసి, వార్తల్లో వ్యక్తులుగా మారారు. ఒకరు రాజకీయ రంగంలో రాటుదేలిన కాంగ్రెస్ నేత పి.చిదంబరం కాగా, మరొకరు ఆధ్యాత్మిక రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న మదురై ఆధీనం అరుణగిరి నాథర్. డీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అంటే ఏమాత్రం గిట్టని చిదంబరం ఆయన ఓటమే తన గెలుపుగా భావిస్తూ ఎన్నికల ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో తన కుమారుడు కార్తీ చిదంబరానికి తగిన స్థానం కల్పించలేదన్న అక్కసుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడంలేదు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం గురువారం చెన్నై చేరుకోవడంతో ఆయన ఇంటి నుంచి కాలు బైటపెట్టారు. పుదుక్కోట్టై జిల్లాలో మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం చేసి మమ అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక జీవితంలో మునిగితేలే మధురై ఆధీనం అరుణగిరి నాథర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంటే వల్లమాలిన అభిమానం. ఇటీవలే స్వయంగా పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి అమ్మకు తన మద్దతు ప్రకటించారు. అంతేగాక అడపాదడపా రాబోయేది అన్నాడీఎంకే ప్రభుత్వమేనని పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో అడుగు ముందుకు వేసి తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ప్రచారం చేశాను, అధిక స్థానాల్లో గెలుపొందింది, నేడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగాను, అమ్మ ప్రభుత్వం గ్యారంటీ అంటూ వేదికపై నుండే జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే అభ్యర్థుల కోసం మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు మధురై ఆధీనం స్వామి తెలిపారు. -
నటి కుష్బుకు మొండిచేయి
చెన్నై: డీఎంకే కూటమిలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దుల తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఎన్నికల వాతావరణం మొదలు కాగానే అందరికంటే ముందుగా డీఎంకేతో పొత్తుకు ఉరకలేసిన కాంగ్రెస్ పార్టీ అనేక తర్జన భర్జనల నడుమ 41 సీట్లను దక్కించుకుంది. తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను తీవ్రంగా విభేదించే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, తదితరులను కాదని 33 మందితో తొలి జాబి తాను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇక మిగిలిన 8 మంది అభ్యర్దుల పేర్లతో కూడిన తుది జాబితా శుక్రవారం విడుదలైంది. కుష్బుకు మొండిచేయి: మైలాపూర్ స్థానం నుండి పోటీచేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు ఎంతగానో ఆశించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీపెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బు కాంగ్రెస్ అధిషానాన్ని సైతం కలిసి వచ్చారు. డీఎంకేతో విభేధించి కాంగ్రెస్ పంచన చేరిన రెండేళ్ల తరువాత మరలా కరుణానిధి ఇంటికి వెళ్లారు. మిత్రపక్ష కూటమి నేత హోదాలో కరుణ ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కుష్బుకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఆమె ఆశిస్తున్న మైలాపూరు నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. కుష్బు ఆశించిన మైలాపూరును మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కూడా ఆశించారు. ఈ విషయంలో ఇద్దరు నటీమణులు పోటీపడగా స్వల్పంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అధిష్టానానికి దగ్గరగా ఉన్న నగ్మానే కుష్బు ప్రయత్నాలకు గండికొట్టి ఉంటారని కాంగ్రెస్‌నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. -
'బ్రాహ్మణులకూ రిజర్వేషన్లు ఉండాలి'
చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని తమిళనాడు బ్రాహ్మణుల్లోని ఓ వర్గం బలంగా కోరుతోంది. తమ తండ్రులూ, తాతలు చేసిన పాపాలకు తమ పట్ల వివక్ష చూపడం తగదని, సమాజంలో తమకూ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. దళిత పురుషులు బ్రాహ్మణ స్త్రీలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి లవ్ జిహాద్ నుంచి తమకు రక్షణ కావాలని కోరుతోంది. బ్రాహ్మణ సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కషి చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. స్థానిక బీజేపీలోని ఓ వర్గంతోపాటు అంతనార్ మున్నేట్ర కళగం (ఏఎంకే) ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. తమకు రాష్ట్రంలో ఇప్పటికే 15 వేల మంది బ్రాహ్మణలు మద్దతు ఉందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఏఎంకే నినదించింది. అలాగే అవమానాలు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో తమను హేళన చేస్తున్నారని ఆరోపించింది. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతురల మధ్య తగువనే వైఖరే విషప్రచారమని, పేద బ్రాహ్మణుడిగా పుట్టడమే నేడు నిజమైన సవాల్ అని మైలాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఈ శేఖర్ అన్నారు. కుల వివక్షత వల్ల నిమ్నవర్గాలు సంఘర్షణకు గురవుతున్న తరుణంలో తాము తమ డిమాండ్లను ముందుకు తీసుకరావడం అసమంజసం ఏమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవ పరిస్థితుల ప్రకారం ప్రైవేశ పరీక్షల్లో బ్రాహ్మణ విద్యార్థులకు 99 శాతం మార్కులు వచ్చినా సరిపోవడం లేదని, తమకూ ఆర్థిక న్యాయం జరగాలని, తమ కుటుంబాల ఆర్థిక స్థోమతను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని శేఖర్ కోరారు. తమిళనాడులో నేడు 40 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని, అందరికి సమాన అవకాశాలు కల్పించాలని, నేడు అన్ని రకాలుగా బ్రాహ్మణులను నిర్లక్ష్యానికి, వివక్షకు గురిచేస్తున్నారని, 50,60 ఏళ్ల క్రితం తమ పూర్వులు చేసిన తప్పులకు ఇప్పుడు తమను శిక్షించడం భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులకు నెలకు కనీసం పది వేల రూపాయలను చెల్లించాలని, ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలయాల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల డిమాండ్‌ను తెర ముందుకు తీసుక రావడం ఇదే కొత్త కాదు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు శాతం రిజర్వేషన్లు కావాలని, ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు పది శాతం రిజర్వేషన్లు కావాలంటూ బ్రాహ్మణ నేతలు వారికి మెమోరాండాలు సమర్పించారు. -
మళ్లీ అమ్మేనా !
అన్నాడీఎంకేకు 116 డీఎంకేకు 101 సీ ఓటర్స్ సంస్థ సర్వేలో వెల్లడి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేకు ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారా ? సీఎంగా అమ్మకే మళ్లీ అవకాశం ఇవ్వనున్నారా? అవుననే అంటున్నాయి. ఇండియా టీవీ కోసం సీ ఓటర్స్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు. చెన్నై : ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారోననే సర్వత్రా ఉత్కంఠ సహజం. అందునా ప్రాంతీయ పార్టీలదే పెత్తనంగా సాగుతున్న తమిళనాడులో ఎందరో నేతలు మరెన్నో ప్రాంతీయ పార్టీలు. గత ఐదు దశాబ్దాలకు పైగా అన్నాడీఎంకే, డీఎంకేలే రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. ఆయా పార్టీల వెంట నడిచే పార్టీలు ఎన్ని ఉన్నా ముఖ్యమంత్రి పీఠం మాత్రం ఈ రెండు పార్టీల అధినేతలకే. బిడ్డ పుడితే అయితే ఆడ లేకుంటే మగ అన్నట్లుగా జయలలిత లేదా కరుణానిధి సీఎం కావడం ఖాయమని చిన్నవాళ్లను అడిగినా ఇట్టే చెబుతారు. అయితే ఈసారి ఎన్నికలు కొద్దిగా భిన్నం. సీఎం సీటు కోసం జయలలిత, కరుణానిధి, అన్బుమణి రాందాస్ (పీఎంకే), విజయకాంత్ (డీఎండీకే) ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ పొత్తులు పూర్తయితే మరెంత మంది ముఖ్యమంత్రుల అభ్యర్థులు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. రాజకీయ ఉత్కంఠల నుంచి ప్రజలకు ఒకింత ఉపశమనం కలిగించేందుకో ఏమో ఇండియా టీవీ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అత్యధిక స్థానాలు అన్నాడీఎంకే, డీఎంకేలకు లభిస్తాయని సర్వే చెబుతోంది. అయితే స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం చేపట్టే స్థాయిలో ఇరుపార్టీలకు సీట్లు రావంటూ గుబులు రాజేసింది. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. అన్నాడీఎం 116, డీఎంకే 101 స్థానాలను గెలుచుకుంటుంది. మిగిలిన 18 స్థానాలను ఇతర పార్టీలు పంచుకుంటాయి. ప్రస్తుత అసెంబ్లీలో అన్నాడీఎంకే 150 స్థానాలు, కూటమి పార్టీలను కలుపుకుని 203 సభ్యులతో బలంగా ఉంది. డీఎంకే కేవలం 23, మిత్ర పక్షాలను కలుపుకుని 31 అసెంబ్లీ స్థానాలతో బలహీనంగా ఉంది. సర్వే సమాచారం ఇలా ఉండగా అసలు ఫలితాలు ఆ సర్వేశ్వరుడికే ఎరుక.