రూ.570కోట్లపై స్పందించిన విశాల్
తమిళనాట సినీరంగానికి, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే రాజకీయంగా జరిగే ప్రతీ పరిణామం పై సినీతారలు తమ అభిప్రాయాలను చెపుతుంటారు. తాజాగా నడిగర్ సంఘం వివాదంతో పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారిన యంగ్ హీరో విశాల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తాజాగా తమిళనాడు ఎలక్షన్ల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు దొరకటం ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంటంతో తమిళనాట డబ్బు ఏరులై పారుతోంది. కనివినీ ఎరుగని రీతిలో ఒకేసారి మూడు కంటైనర్ లలో 570 కోట్ల డబ్బు దొరకటం సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలకు కూడా షాక్ ఇచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన ఆ భారీ నగదును చిన్న పిల్లల చదువు, మధ్యాహ్న భోజన పథకాలకు వినియోగించాలంటూ సలహా ఇచ్చాడు విశాల్.
570 cr seized in Tirupur without documents??? wish they use it for children education n mid day meal scheme.wil b enuf for 570cr kids
— Vishal (@VishalKOfficial) 14 May 2016