visakhapatnam beach
-
#VisakhapatnamBeach : విశాఖబీచ్‌లో సండే సందడి (ఫొటోలు)
-
ఏపీలో కనువిందు చేసే ఆకర్షణీయమైన బీచ్‌లు (ఫొటోలు)
-
విశాఖ : సందర్శకులతో కిటకిటలాడుతున్న ఆర్కేబీచ్ ( ఫొటోలు)
-
కడలి కోత పెడుతోంది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరం మళ్లీ కోతకు గురవుతోంది. తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోంది. గతంలో 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కే బీచ్ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు. యారాడ నుంచి భీమిలి వరకూ.. సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడం వల్ల తీరంలో ఇసుక పెద్దమొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ ఇక్కడి తీరం కోత సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ఇందులో యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్ చేస్తుంది. దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది. తాజాగా దూకుడు తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది. దాదాపు వారం రోజులుగా ఈ పరిస్థితి ఉంది. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓ రిసార్ట్స్ సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. ఈ చెట్లు బీచ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. అలల ఉధృతి ఎక్కువైంది ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 11వ తేదీన పౌర్ణమి వచ్చింది. మరోవైపు ఉత్తరం వైపు నుంచి గాలుల ఉధృతి కూడా పెరిగింది. వీటి ప్రభావంతో అలల ఉధృతి సాధారణం కంటే అధికమైంది. సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ తాజాగా విశాఖ తీరం కోతకు కారణమవుతున్నాయి. – ప్రొఫెసర్ కేవీఎస్ఆర్ ప్రసాద్, వాతావరణం–సముద్ర అధ్యయన విభాగ పూర్వ అధిపతి, ఏయూ -
విశాఖ బీచ్ లో ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సందడి
-
విశాఖ బీచ్: హాయ్.. హాయ్..! అంటూ ఎంజాయ్! (ఫొటోలు)
-
‘సాగర’ తోరణాలు
సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలకు నెలవైన విశాఖ సాగర తీరం దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. తూర్పు కనుమలు ఓవైపు.. అలల సయ్యాటలు మరోవైపు.. ఇసుక తిన్నెలపై కనువిందు చేసే రాతి దిబ్బల రమణీయత ఇంకొకవైపు.. ఎల్లప్పుడూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి. ఈ అందాలకు అదనపు ఆకర్షణగా సాగర తీరంలో ఏర్పడిన సహజ శిలా తోరణం.. ప్రతి ఒక్కర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇప్పుడు అదే విశాఖకు మరో అద్భుతం తోడైంది. సాగర గర్భంలో మరొక శిలా తోరణం బయటపడింది. సరికొత్త అనుభూతి.. రాతి శిలా సంపదతో సరికొత్త అనుభూతిని అందించే తొట్లకొండ బీచ్‌కు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ శిలా తోరణం మధ్య నుంచి ఎగసిపడే అలల్ని సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. విశాఖ సాగర గర్భంలో ఇటీవల మరో సహజ శిలా తోరణం బయటపడింది. రుషికొండ తీరంలో సాహస క్రీడలు నిర్వహిస్తూ.. స్కూబా డైవింగ్ చేసే లివిన్ అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులు దీన్ని కనిపెట్టారు. తీరం నుంచి సాగర గర్భంలోకి 2 కిలోమీటర్ల దూరంలో.. 30 అడుగుల లోతులో.. ఈ రాతి అందం దర్శనమిచ్చింది. ఒక మీటరు ఎత్తు, 150 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ శిలా తోరణం ఉన్నట్లు లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. వేల సంవత్సరాల పాటు అలల తాకిడికి రాళ్లు కరిగి ఈ సహజ అందం ఏర్పడిందని భావిస్తున్నారు. దీన్ని తిలకించేందుకు స్కూబా డైవర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరముందన్నారు. దీనిపై పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సహజ అందాలకు పొంచి ఉన్న ముప్పు.. తొట్లకొండ శిలాతోరణం.. తన సహజత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. యువతీ, యువకులు ఈ శిలా తోరణంపైన చిందులు వేస్తున్నారు. కొందరు ఫొటోలు దిగుతుండగా, మరికొందరు ఏకంగా ద్విచక్ర వాహనాల్ని ఎక్కించేసి ఫొటో షూట్లు చేస్తున్నారు. అలల తాకిడికి రాయి కరిగి తోరణంగా ఏర్పడింది. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సంరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వాహనాలు వెళ్లకుండా చర్యలు సహజ శిలా తోరణాన్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. స్థానికంగా అక్కడ ఉండే వారిని సంరక్షకులుగా నియమించాం. శిలాతోరణం వద్దకు వాహనాలు వెళ్లకుండా.. రోడ్డు వద్దే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సిద్ధమైన అందాల్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. – పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సాగర గర్భంలో అద్భుతంగా ఉంది రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో శిలాతోరణం బయటపడింది. దగ్గరకు వెళ్లి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. తొట్లకొండలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. 45 నిమిషాల పాటు ఈ శిలాతోరణం పరిసరాల్ని రికార్డు చేశాం. స్కూబా డైవర్లకు ఇది గొప్ప అనుభూతిని అందిస్తుంది. – బలరాంనాయుడు, లివిన్ అడ్వెంచర్స్ ఎండీ -
విశాఖ బీచ్‌లో ప్రమాదకరంగా మారిన వ్యాయామ పరికరాలు
-
విశాఖపట్నం బీచ్‌లో పొలిటికల్ టెన్షన్
-
ఆ చేపల్ని తింటే ఇక అంతే సంగతులు
విశాఖతీరంలో విష మత్స్యాలు తింటే చనిపోతారంటున్న శాస్త్రవేత్తలు పరిశోధనలతో వెలుగులోకి సాక్షి, విశాఖపట్నం: విశాఖ తీరంలో విషపు చేపల ఉనికి వెల్లడయింది. వీటిని తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దేశంలోని తూర్పు తీరంలోకెల్లా ఒక్క విశాఖలోనే అత్యంత అరుదైన షార్ప్‌టైల్ మోలా రకం చేప ఉన్నట్టు పరిశోధకుల పరిశీలనలో తేలింది. దీనిని సన్‌ఫిష్‌గాను, పఫర్ ఫిష్‌గా కూడా వ్యవహరిస్తారు. స్థానిక మత్స్యకారులు కప్ప చేపగా పిలుస్తారు. అర్ధచంద్రాకారంలో సుమారు 40–45 కిలోల బరువు, 1.4 మీటర్ల పొడవు ఉండే ఈ చేపలు తినేందుకు పనికిరావు. వీటిలో విషపూరితమైన సఫర్ పాయిజన్ గ్రంధులు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెట్రాడోటాక్సిన్ అనే విషాన్ని విడుదలచేస్తాయి. వీటిని తింటే వాంతులవడంతోపాటు, పక్షవాతానికి గురై మరణిస్తారు కూడా. ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్ (ఎంఎల్ఆర్) విభాగం పూర్వ అధిపతి ప్రొఫెసర్ దేవర వేణు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిషింగ్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ ఎన్ఎం కృష్ణ, ఆదికవి నన్నయ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.గోవిందరావు సముద్రంలో అరుదైన కొత్త జాతులు, అంతరించిపోతున్న మత్స్యసంపదపై పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో ఈ కప్ప చేప (షార్ప్‌టైల్ మోలా) లభ్యమైంది. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంటుంది. నోరు డైమండ్ ఆకారంలో ఉంటుంది. రెండు పళ్లు ఉంటాయి. ప్రపంచం మొత్తమ్మీద ఇలాంటి జాతి చేపలు 4 రకాలే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ షార్ప్‌టైల్ చేపకు దగ్గర పోలికలున్న మరో రకం చేప పశ్చిమ తీరంలో ఉన్నట్టు ఇదివరకు గుర్తించారు. కానీ దానికి తోక మాత్రం ఉండదు. దీనిని శాస్త్రీయ పరిభాషలో మోలామోలాగా పిలుస్తారు. కాగా కప్ప చేపలు విషపూరితమని స్థానిక మత్స్యకారులకు తెలుసు. వీటిని తినడం ప్రాణాంతకమన్న విషయంపై అవగాహన కల్పించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఎలా ఆపాలో మాకు తెలుసు
మా వ్యూహం మాకుంది సీపీ యోగానంద్ పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖ బీచ్‌లో ఆందోళనకు దిగితే చూస్తు ఊరుకోం.. ఆందోళనను ఎలా ఆపాలో మాకు తెలుసు అని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏం చేయాలి అనేదానిపై మా వ్యూహం మాకుందని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, లేదా ఇతర రాజకీయ, రాజకీయేతర పార్టీల నేతలు వచ్చినా సాగరతీరంలో ఎటువంటి ఆందోళనలు చేసేందుకు అనుమతి ఇవ్వమన్నారు. ఒకవేళ అక్రమంగా సాగరతీరంలో చొరబడి ఆందోళనకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. 26న గణతంత్ర దినోత్సవం కావడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశమంతా రెడ్అలర్ట్ ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం కీలకమైన ప్రాంతమని ఇక్కడ తూర్పు నావికాదళంతో పాటు ప్రతిష్టాత్మకమైన సంస్థలు, కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కావాలంటూ సాగర తీరాన నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సరికాదన్నా రు. కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన, జలదీక్షలు వంటివి చేపడతామని సిద్ధం అవుతున్న వారెవ్వరికి అనుమతులు ఇవ్వలేదన్నారు. భద్రత దృష్ట్యా ఈనెల 26, 27, 28 తేదీల్లో ఇటువంటి నిరసనలు, ఆందోళనను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ కార్యక్రమాన్ని అనుమతించమన్నారు. నిరసనలు, ధర్నాలపై అన్ని రాజకీయ పార్టీలు మరోసారి సమాలోచన చేయడం మంచిదని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాజకీయ, రాజకీయేతర పార్టీలను హెచ్చరించడం జరిగిందన్నారు. నగరంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పక్క జిల్లాల నుంచి తరలివచ్చే వారిని నియంత్రించడంలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించామని వెల్లడించారు. aతీర ప్రాంతంలో నివసించేవారు తమ గుర్తింపు కార్డు, నివాసధ్రువ పత్రం తమతో పాటు ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పాటు అదనంగా ప్రత్యేక దళాలను రప్పిస్తున్నామని అన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ యోగానంద్ చెప్పారు. -
యువతపై ఉక్కుపాదమా?
♦ హోదా ఉద్యమకారులపై సర్కారు నిర్బంధం ♦ శాంతియుత ప్రదర్శనలపైనా ఆంక్షలు ► ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యం ► హోదా పోరాటానికి అనుమతి లేదు: డీజీపీ ► విశాఖ దారుల్లో చెక్‌పోస్టులు, బీచ్‌లో సీసీ కెమెరాలు, ► అయినా వెనుకంజ వేసేది లేదంటున్న యువత ► ఇది ఆఖరిపోరాటం అంటూ కదులుతున్న యువతీ యువకులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, అమరావతి, విశాఖపట్నం: సాగరతీరాన ఉత్తుంగ తరంగా లను ఆంక్షలతో ఎవరైనా ఆపగలరా?... జల్లికట్టు పోరాట స్ఫూర్తితో ప్రత్యేకహోదాను సాధించుకోవడం కోసం ఉరకలెత్తుతున్న యువతను అనుమతుల పేరుతో ఆపాలను కోవడం సరిగ్గా అలాంటిదే. గణతంత్ర దినో త్సవాన విశాఖ తీరంలోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ జరిగే కార్య క్రమాలలో పాల్గొనాలని, హోదా పట్ల తమ ఆకాంక్షను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తిం చేలా చేయాలని యువత సర్వసన్నద్ధమవు తు న్న నేపథ్యంలో వారిని ఎలాగైనాసరే అడ్డుకుని ఉద్యమాన్ని నీరుగార్చడానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. హోదా కోసం జరిగే ర్యాలీలకు అనుమతి లేదని, తరలి వచ్చేవారిని అడ్డుకుంటామని డీజీపీ నండూరి సాంబశివరావు మంగళవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు. విశాఖలో ప్రదర్శనలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతీ లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కార్యక్రమాల కూ అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు. అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనలలో పా ల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుం టామ ని, కేసులు పెడతామని విశాఖ కలెక్టర్, పోలీ సు కమిషనర్ హెచ్చరించారు. అన వసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యార్థుల కు హితవు పలికారు. అవసరమైతే హౌస్ అరెస్టులు చేస్తామని, విశాఖ బీచ్‌లో సీసీ కెమెరాలు పెట్టామని వారు పేర్కొన్నారు. అయితే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెను కంజ వేసే ప్రసక్తిలేదని, ప్రత్యేక హోదా ఉద్య మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే తీసుకు పోతామని యువత స్పష్టం చేస్తోంది. హోదా కోసం జరిగే అన్ని కార్యక్రమాలకు సంఘీభా వం ప్రకటించాలని, హోదా ఆకాంక్షను వెల్లడి స్తూ 26న కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాల ని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునివ్వడం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. హోదాపై ఇంత నిర్బంధమా..? ఐదున్నర కోట్ల మంది ప్రజల ఏకైక ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఈ స్థాయిలో నిర్బంధం ప్రయోగించడం చూసి రాష్ట్రప్రజలు విస్తుపో తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున డీజీపీ ఇలా ప్రకటించారంటే అది ముఖ్యమంత్రి మాటగానే భావించాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష కోసం తాను ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుం డడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ.. తెలుగుప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా మారిన ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అనుమతిలేని నిరసనలు, ర్యాలీలలో పాల్గొనే వారిని అరెస్టు చేస్తామని, జైళ్లలో నిర్బంధిస్తా మని పోలీసులు అంటున్నారు. డీజీపీ వ్యాఖ్య లతో రాష్ట్రంలోని 13 జిల్లాల పోలీసు అధికా రులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ జరపతలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలను భగ్నం చేయడానికి వ్యూహాలు రచించడం ప్రారంభించినట్లు పోలీసు వర్గాల లో వినిపిస్తోంది. ముఖ్యనేతల గృహనిర్బంధా లతో ఉద్యమాన్ని నీరుగార్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చడంపైనా ఆంక్షలు విధిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వైపు జిల్లాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్న యువతీయువకుల సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వినిపిస్తోంది. ఏది ఏమైనా ముందుకే.. రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధించుకో లేమన్న అభిప్రాయం యువతలో గట్టిగా నెలకొంది. రెండున్నరేళ్లుగా ఎదురు చూసిన యువత ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక తీవ్ర నిరాశలో కూరుకుపో యింది. దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అన్న అభిప్రాయానికి వచ్చారు. పొరుగున ఉన్న తమిళనాడులో సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్రమంతా ఒక్కతాటి పైకి రాగలిగినప్పుడు ఐదున్నరకోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోలేమా అని ప్రశ్నతో యువత రగిలిపోతోంది. అందుకే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెనుకంజ వేసేది లేదని యువతీయువకులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాకేం ద్రాలకు చేరుకునేందుకు అన్ని జిల్లాల్లోనూ యువతీయువకులు సన్నద్ధమౌతున్నారు. అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీల కతీతంగా జరుగుతున్న ఈ పోరాటం లో అందరూ ఒక్కతాటిపై నిలవాలని, హోదా సాధించేవరకు పట్టుదలగా పోరాడాలని సామాజిక మాధ్యమాలలో ఒకరికొకరు సందే శాలు పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకహోదాకు సంబంధించిన పోస్టులు, చర్చలే ఉంటున్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు సంబంధించిన డిస్ప్లే పిక్చర్లన్నీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో కూడిన పిక్‌లుగా మారిపోయాయి. ర్యాలీలను అనుమతించం..: డీజీపీ ‘‘ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అనుమ తించం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఆయన మీడియా సమావేశం నిర్వహిం చారు. జల్లికట్టును ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్‌లో యువత నిరసన తెలపాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న మెస్సేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియని ఇటువంటి కార్యక్రమాలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. పెద్ద కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిర్వాహకులు ఎవరన్నది చూసి అనుమతి ఇస్తామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వీఐపీలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి నిరసనలు, ఆందోళనలు వంటి సోషల్ మీడియా పిలుపులకు, ట్వీట్లకు స్పందించి యువత పాల్గొనవద్దని కోరారు. విశాఖ బీచ్‌లోనే కాదు సోషల్ మీడియాలో పిలుపునిచ్చినట్టు విజయ వాడ, తిరుపతిలో ర్యాలీలకు అనుమతిలేదని, నిరసనలు జరుగుతాయనుకున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులోకి తెస్తామని, కాదని వస్తే అడ్డుకుంటామని డీజీపీ చెప్పారు. 26న కార్యక్రమాలకు అనుమతి లేదు: విశాఖ కలెక్టర్, కమిషనర్ విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న యువత తలపెట్టిన మౌన ప్రదర్శన. నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి యువత ఈ ప్రదర్శనల్లో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో అప్రమత్త మైన జిల్లా యంత్రాంగం మంగళవారం సమీక్షించింది. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్, సీపీలు మీడియాతో మాట్లాడారు. ’జనవరి 26న రిపబ్లిక్ డే.. 27, 28 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ప్రదర్శనలు..ర్యాలీలు చేయడం తగదని కలెక్టర్, సీపీలు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కేసులు నమోదు చేస్తాం.. అనవసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సీపీ హెచ్చరించారు ర్యాలీ చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్ట్‌లు సైతం చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇందుకోసం ఆర్కేబీచ్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.