Visit Visas
-
యూకే వీసా 15 రోజుల్లోనే: బ్రిటిష్ హైకమిషనర్ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయులకు యూకే తీపి కబురు చెప్పింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 15 రోజుల్లో వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. వీసాల జారీపై భారీ జాప్యం, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోల్చితే భారతీయ విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగిందని భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ (అక్టోబర్ 18) ట్విటర్లో వెల్లడించారు. విజిటర్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించామని ట్విటర్లో షేర్ చేసిన ఒక వీడియోద్వారా తెలిపారు. అలాగే ఐటీ నిపుణుల వర్క్ వీసాల ఆలస్యాన్ని నివారించడం తోపాటు, జారీ ప్రక్రియను మరింత వేగంగా ప్రాసెస్ చేయనున్నామన్నారు. ఈ నిర్ణయం ఐటీ నిపుణుల తోపాటు, చాలామంది భారతీయులకు ఊరటనిస్తోంది. దీంతో పలువురు హర్షం ప్రకటిస్తున్నారు. 15 రోజుల టైమ్‌లైన్ చాలా ఉపశమనం కలిగిస్తుందని ఒక ట్విటర్ యూజర్ కమెంట్ చేశారు. షార్ట్ టర్మ్ స్టడీ విజిటర్ వీసా కోసం అప్లై చేసి 9 వారాలు అయినా ఇంకా రాలేదని మరో యూజర్ ఫిర్యాదు చేశారు. వీసా రాని కారణంగా యూనివర్సిటీలో ఫిజికల్ హాజరు గడువు దాటిపోవడంతో స్టడీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇపుడిక మంచి జరుగుతుందని భావిస్తున్నారు. We are on track to get back to processing 🇮🇳 to 🇬🇧 #visa applications within our standard of 15 days. 👉 Student numbers ⬆️ by 89% since last year. 👉 Skilled workers visas bring processed faster 👉 Focus on improving visitor visa processing times. A long way come, more to go. pic.twitter.com/cjX26mRxs8 — Alex Ellis (@AlexWEllis) October 18, 2022 -
‘ఇరాక్‌లో చిక్కుకున్న వారిని రక్షించండి’
న్యూఢిల్లీః ఉపాధి కోసమని ఇరాక్ వెళ్లి.. ఏజెంట్ల మోసాలకు బలై విజిట్ వీసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 500 మంది తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని గల్ఫ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయను కోరింది. వర్కింగ్ వీసా అంటూ నమ్మించి విజిట్ వీసాపై ఇరాక్ తీసుకెళ్లి అక్కడ వదిలేస్తున్న ఏజెంట్ల బారి నుంచి తెలంగాణ వాసులను కాపాడాలని వేడుకుంది. వారందరినీ తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గురువారం ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి దత్తాత్రేయకు వినతిపత్రం సమర్పించారు. -
మలేసియా జైళ్లలో తెలుగు కార్మికులు
విజిట్ వీసాలపై మలేసియా వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ జలన్‌భూత్ ప్రాంతంలోని నివాస గృహాలపై రెండు రోజుల క్రితం దాడులు చేపట్టిన అక్కడి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా ఉంటున్నారనే కారణంతో దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా అక్కడి సూపర్మార్కెట్లో పని చేస్తున్న నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగాపూర్ వాసి నరేందర్ ‘సాక్షి’కి ఫోన్లో ఈ మేరకు సమాచారం అందించారు. తాజా దాడులతో మలేసియాలో పని చేస్తున్న తెలుగువారు భయాందోళనలకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పట్టుబడిన వారిని జైళ్లలోనూ డిటెన్షన్ సెంటర్లలోనూ ఉంచుతున్నారు. ఆరునెలల కాలంలో రెండోసారి పోలీసులు దాడులు నిర్వహించారని నరేందర్ వివరించారు. అయితే పట్టుబడిన వారి వివరాలను గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఇక్కట్లు పడుతున్న తమను స్వగ్రామాలకు చేర్చాలని బాధితులు కోరుతున్నారు.