న్యూఢిల్లీః ఉపాధి కోసమని ఇరాక్ వెళ్లి.. ఏజెంట్ల మోసాలకు బలై విజిట్ వీసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 500 మంది తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని గల్ఫ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయను కోరింది.
వర్కింగ్ వీసా అంటూ నమ్మించి విజిట్ వీసాపై ఇరాక్ తీసుకెళ్లి అక్కడ వదిలేస్తున్న ఏజెంట్ల బారి నుంచి తెలంగాణ వాసులను కాపాడాలని వేడుకుంది. వారందరినీ తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గురువారం ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి దత్తాత్రేయకు వినతిపత్రం సమర్పించారు.
‘ఇరాక్‌లో చిక్కుకున్న వారిని రక్షించండి’
Published Thu, Sep 22 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement