viswajith
-
మరో డ్రంకెన్ ‘డెత్’
హైదరాబాద్: డ్రంకెన్ ‘డెత్’లకు జూబ్లీహిల్స్ అడ్డాగా మారుతోంది. రాత్రి వేళల్లో విపరీతంగా మద్యం సేవించి వేగంగా వాహనాలు నడిపే వారి సంఖ్య ఇక్కడ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో డ్రంకెన్ ‘డెత్’ జరిగి వారమైనాకాకముందే ఇలాంటిదే మరో ఘటన చోటుచేసు కుంది. శుక్రవారం రాత్రి నలుగురు యువకులు మద్యం మత్తులో రేసింగ్ కారులో దూసుకుపోతూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టారు. దీంతో కారు ఎగిరి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాసర పుణ్యక్షేత్రంలో సస్పెన్షన్‌కు గురైన అర్చకుడు వాల్వాకర్ విశ్వజిత్(33) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొకరు సురక్షితం గా బయటపడ్డారు. బాసరలో నివసించే విశ్వజిత్, జూబ్లీహిల్స్ రోడ్ నం.79లో ఉండే ఆయిల్ వ్యాపారి డీఎల్ వివేక్ రాజ్(29), మల్కాజ్‌గిరికి చెందిన వెబ్ డిజైనర్ ఓర్సు పృథ్వీరాజ్(29), మౌలాలిలో వస్త్ర వ్యాపారి చెట్టి చెన్నకేశవ(27) స్నేహితులు. వివేక్‌ను కలిసేందుకు విశ్వజిత్ శుక్రవారం నగరానికి వచ్చాడు. రాత్రి 9 గంటలకు కారు సర్వీసింగ్ కోసం హిమాయత్‌నగర్‌కు వెళ్లిన వీరిని పృథ్వీ, చెన్నకేశవ వచ్చి కలిశారు. అనంతరం నలుగురూ వివేక్ ఇంటికి వచ్చారు. వీరు వివేక్ వెంటో కారులో మణికొండ వెళ్లా రు. రాత్రి 12.30 వరకు అక్కడ ఓ వైన్‌షాప్‌లో ఫుల్ బాటిల్ తీసుకొని కారులో కూర్చొని మద్యం సేవించారు. అనంతరం ఫిలింనగర్ రోడ్ నం.1లో ఉన్న ఫిలించాంబర్ వద్దకు వచ్చి కారు రేసింగ్ అంటే ఏమిటో చూపిస్తానంటూ వివేక్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. పక్కసీటులో పృథ్వీ, వెనుక సీటులో విశ్వజిత్, చెన్నకేశవ కూర్చున్నారు. 120 కి.మీ. వేగంతో దూసు కెళ్తూ సడెన్ బ్రేక్ వేస్తూ గంట పాటు ఆ రహదారులపై విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2.11కి జూబ్లీహిల్స్ రోడ్ నం.78లో అతి వేగంతో దూసుకెళ్తూ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఫుట్‌పాత్ ఎక్కి చెట్టు ను ఢీకొంది. వెనుక సీటులో విశ్వజిత్ కూర్చున్న వైపే చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన వివేక్, చెన్నకేశవలను కాచిగూడలోని ఆస్పత్రికి తరలించారు. సీటు బెల్టు ధరించడంతో పృథ్వీ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారకుడైన వివేక్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304 పార్ట్(2) కింద కేసు నమోదు చేశారు. మృతుడు బాసర అర్చకుడు... బాసర పుణ్యక్షేత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్న విశ్వజిత్ ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవ విగ్రహాల అక్రమ తరలింపులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. తండ్రి సుధీర్ న్యాయవాది. కారు నడుపుతున్న వివేక్ ఆయిల్ బిజినెస్ చేస్తుండగా కారు మాత్రం తల్లి పేరు మీద ఉంది. పోలీసులు వివేక్‌కు శ్వాస పరీక్ష నిర్వహించగా బ్లడ్‌లో ఆల్కహాల్ కంటెంట్ ఉన్నట్లు తేలింది. -
దూకుడు తగ్గించుకో..
ఏఎస్పీకి కలెక్టర్, ఎస్పీ క్లాస్ విశ్వజిత్ తీరుపై సీఎం కార్యాలయం ఆరా డీజీపీకి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఫిర్యాదు వరంగల్ : మేడారం జాతరలో వివాదాస్పద పోలీసు అధికారిగా ముద్రపడిన ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి తీరుపై సీఎం కార్యాలయం స్పందించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో అత్యవసర వైద్యసేవ లందించేందుకు వెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి... డ్రైవర్, వైద్యుడు, సీనియర్ జర్నలిస్ట్‌ను దారుణంగా కొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. బుధవారం జరిగిన ఈ ఘటన, ఏఎస్పీ విశ్వజిత్ పనితీరుపై సమాచారం పంపించాలని ఎస్బీ అధికారులను ఆదేశిం చింది. మరోవైపు డీజీపీ కార్యాలయం కూడా ఈ సంఘట నపై జిల్లా అధికారులను వివర ణ అడిగినట్లు తెలిసింది. ములుగు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వజిత్ పనితీరు కొంత ఇబ్బందిగానే ఉందని పోలీసు వర్గాలు సమాచారం రూపొందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మేడారం జాతర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర మంత్రులు స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ములు గు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి అస్వస్థతతో ఉన్న మహిళను తీసుకెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి.. ఇద్దరు ఉద్యోగులను దారుణంగా కొట్టడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో తదుపరి చర్యల కోసం సమగ్ర సమాచా రం సేకరిస్తోంది. మరోవైపు బుధవారం జరిగిన ఘటనపై రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జిల్లా కలెక్టర్ కరుణ విశ్వజిత్ కాంపాటిని మందలించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అంకితభావం కంటే స్వీయ నియంత్రణ ముఖ్యమని సూచించినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలి నుంచి వివాదాస్పదమే.. ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందనే అభిప్రాయం ములుగు ప్రాంతంలో ఉంది. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఏఎస్పీ స్వయంగా తమ ను కొట్టారని మంగపేటకు చెందిన అధికార టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. భూమి విషయంలో తమను కొట్టిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని మంత్రి చందులాల్‌ను కోరారు. మేడారం ఘటన నేపథ్యంలో ఈ వివరాలను కూడా సేకరిస్తున్న ట్లు తెలిసింది. విశ్వజిత్ ఓసారి లక్నవ రం సరస్సుకు వెళ్లినప్పుడు బోటింగ్ ఆలస్యమైందనే కారణంతో స్థానిక పోలీ సులు బోటింగ్ నిర్వాహకులను ఒక రోజంతా పీఎస్‌లో పెట్టి కొట్టారని ఎస్ బీ అధికారులకు సమాచారం ఉంది. ఈ అన్ని అంశాలతో ఎస్బీ విశ్వజిత్‌పై నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాగా, వరంగల్‌లో సీనియర్ జర్నలిస్టు పాశం యా దగిరిపై ఏఎస్పీ విశ్వజిత్ దాడి చేసిన విషయమై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన డీజీపీని కలిశారు. -
యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి
సాక్షి, ముంబై: రైతుల సమస్యలపై సోమవారం శాసనసభ భవనంవైపు దూసుకొచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ తొలుత వీరంతా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరంతా శాసనసభ వైపు దూసుకువస్తుండడాన్ని గమనించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు పోలీసులను పక్కకునెట్టేసి బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తమని అణిచివేసే ప్రయత్నం చేసిందని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వజిత్ కదం ఆరోపించారు. అయితే బారికేడ్లను చేధించుకుని ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించినందువల్లనే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు సమర్ధించుకున్నారు.