విశాఖ భూకబ్జాలపై సిట్ విచారణ ప్రారంభం
విశాఖ : విశాఖ భూ దందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను బుధవారం నుంచి ప్రారంభించింది. భూ ట్యాంపరింగ్, ఆక్రమణలు సంబంధించిన ఫిర్యాదుల్ని నాలుగు విధానాలుగా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీపీ యోగానంద్ మాట్లాడుతూ భూముల రికార్డుల ట్యాంపరింగ్, అందుకు సహకరించిన అధికారులు, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తులపై విచారణ జరుపుతామని తెలిపారు.
బాధితులు నేరుగా తమను కలవొచ్చని, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగిస్తామన్నారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్, జాయింట్ కలెక్టర్ జి.సృజన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.