vohra
-
చదువుకునే వయసులో స్టార్టప్.. 19 ఏళ్లకే కోటీశ్వరుడు
Kaivalya Vohra Success Story: చదువుకునే వయసులోనే ఏదో సాధించాలనే తపనతో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఒక కంపెనీ స్థాపించి సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న యువకుడు 'కైవల్య వోహ్రా' (Kaivalya Vohra). ఇంతకీ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. చదువుకునే విద్యార్థులలో చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. కానీ కైవల్య స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. 2001లో జన్మించిన కైవల్య వోహ్రా ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసి అమెరికాలో ఇంజినీరింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ సొంతంగా కంపెనీ ప్రారంభించాలని ఆశపడుతున్న కైవల్య అక్కడ చాలా రోజులు ఉండలేకపోయాడు. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) కైవల్య వోహ్రా తన 17వ ఏటనే మొదటి స్టార్టప్‌ని నిర్మించిన తన స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తన స్టార్టప్‌ని ప్రారంభించాడు. వారి మొదటి స్టార్టప్ పేరు గోపూల్. అయితే వారిద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే 'జెప్టో' (Zepto) గురించి ఆలోచించారు. ఆ సమయంలో ఏదైనా ఆర్డర్ చేస్తే అవి డెలివరీ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారు 2021లో జెప్టో (గ్రోసరీ డెలివరీ యాప్) ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కేవలం కొన్ని నెలల్లో 1000 మంది ఉద్యోగులు, ఏజంట్లు ఇందులో చేరారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) జెప్టో ప్రారంభమైన ఒక నెలలోనే వారు 200 మిలియన్ డాలర్లు సంపాదించగలిగారు. ఒక సంవత్సర కాలంలోనే దీని విలువ రూ. 7,300 కోట్లకు చేరింది. ఇప్పటికి కైవల్య నికర విలువ రూ. 1200 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ 10 పెద్ద నగరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ వయసులో కోటీశ్వరుడుగా పేరు తెచ్చుకున్నాడు. -
భారత సంతతి విద్యార్థి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థిని దోపిడీ దొంగలు కాల్చిచంపారు. షికాగోలోని డాల్టన్‌లో క్లార్క్ స్టోర్, గ్యాస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న అర్షద్ వోహ్రా(19)ను అక్కడ దొంగతనానికి వచ్చిన సాయుధులు గురువారం కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వోహ్రాకు పరిచయమున్న బకర్ సయీద్ తీవ్రంగా గాయపడ్డాడు. తన తండ్రికి బదులుగా వోహ్ర గ్యాస్ స్టేషన్లో ఆరోజు పనిచేస్తున్నాడని, నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 12వేల డాలర్ల రివార్డును అందజేస్తామని పోలీసులు తెలిపారు. -
మాఫియాతో సంబంధాలపై..
ఢిల్లీ: వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని అభిప్రాయపడుతున్నానని తెలిపారు. వోహ్ర కమిటీ తన నివేదికలో రాజకీయ నాయకులకు, మాఫియా లీడర్లకు గల సంబంధాలను ప్రస్తావించింది. మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజల దృష్టి వోహ్రా రిపోర్టుపై పడిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హౌం శాఖ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన నివేదికలోని అంశాలను ప్రజలముందుంచాల్సిన అవసరముందన్నారు. ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజలు దావూద్ ఇబ్రహీం ను వెనక్కి రప్పించడం గురించి డిమాండ్ చేస్తున్నారనీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ వోహ్రా నేతృత్వంలో 1990 లలో వేసిన కమిటీ నేరపూరితమైన రాజకీయాలపై నివేధిక ఇచ్చింది. దీనిలో రాజకీయ నాయకులకు, నేరగాళ్లకు గల సంబంధాలపై పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.