Voltas company
-
రూ.500 కోట్లతో వోల్టాస్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిఫ్రిజిరేటర్లు, ఏసీల తయారీలో ఉన్న వోల్టాస్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూమ్ ఏసీల తయారీ కోసం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో కేంద్రాన్ని స్థాపించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూప్ కంపెనీ అయిన వోల్టాస్‌కు ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒకటి, గుజరాత్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో సుమారు 1500 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
ఓల్టాస్ లాభం రూ.107 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.107 కోట్లకు పెరిగిందని ఓల్టాస్ తెలియజేసింది. కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.1,032 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.1,415 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.87 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో రూ.109 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ 8.4 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గిందని కంపెనీ తెలిపింది. కొనసాగుతున్న అగ్రస్థానం..... రూమ్ ఏసీల మార్కెట్లో తమ అగ్రస్థానం కొనసాగుతోందని ఓల్టాస్ తెలిపింది. గత క్యూ2లో 23.2 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటా ఈ క్యూ2లో 25.6 శాతానికి పెరిగిందని పేర్కొంది. -
వోల్టాస్ లాభం 51 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 51% పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) క్యూ4లో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.181 కోట్లకు పెరిగిందని వోల్టాస్ తెలిపింది. ప్రాజెక్టుల వ్యాపార సంబంధిత ఆర్డర్ల నిర్వహణ మెరుగుపడడం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.1,484 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,876 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ. 2.6 డివిడెండ్ చెల్లించడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేర్ బీఎస్ఈలో 3% వృద్ధితో రూ.335 వద్ద ముగిసింది.