వోల్టాస్ లాభం 51 శాతం అప్ | Voltas Q4 net profit rises 51 percent to Rs 181 crore | Sakshi
Sakshi News home page

వోల్టాస్ లాభం 51 శాతం అప్

Published Wed, May 18 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

వోల్టాస్ లాభం 51 శాతం అప్

వోల్టాస్ లాభం 51 శాతం అప్

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 51% పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) క్యూ4లో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.181 కోట్లకు పెరిగిందని వోల్టాస్ తెలిపింది. ప్రాజెక్టుల వ్యాపార సంబంధిత ఆర్డర్ల నిర్వహణ మెరుగుపడడం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.1,484 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,876 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ. 2.6 డివిడెండ్ చెల్లించడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేర్ బీఎస్‌ఈలో 3% వృద్ధితో రూ.335 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement