Volunteer Army
-
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
హిట్లర్ కన్ను పడింది!
మన ఘనత భారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో 1949 నుండి ఏటా డిసెంబర్ 7న మనం ‘ఫ్లాగ్ డే’ జరుపుకుంటున్నాం. త్రివిధ దళాల సైనికుల గౌరవార్థం నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మన ఆర్మీ గురించి 5 విశేషాలు! హిట్లర్‌కు ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం. ఒక సందర్భంలో ఆయన మన ‘గూర్ఖా’ దళం సహాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట. గూర్ఖా సైనికులు తన దగ్గర ఉంటే మొత్తం ఐరోపా ఖండాన్నే తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవచ్చని ఆయన తలపోశారట! జర్మనీ సైనికులకు దీటైన శక్తి ప్రపంచంలో గూర్ఖా దళం ఒక్కటే అని హిట్లర్ అన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సైనిక దళం భారత్‌కే ఉంది. ఖండాంతర క్షిపణి అగ్ని-5 ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడం ద్వారా భారత్... యు.ఎస్. ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలోని యుద్ధక్షేత్రం భారత్ నియంత్రణలో ఉంది. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో మన సైనికులు గస్తీ కాస్తున్నారు. అతిపెద్ద వలంటీర్ ఆర్మీ.. ప్రపంచంలో ఒక్క భారత్‌కే ఉంది. నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన వారిని వలంటీర్ ఆర్మీ అంటారు. (నేడు భారతీయ సైనిక దళాల పతాక దినోత్సవం)